Corona in China: చైనాలో మరోసారి కరోనా విలయతాండవం: వైరస్ కేంద్రంగా షాంఘై నగరం

చైనాలోని తూర్పు ప్రాంతంలో గత రెండు వారాలుగా ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కఠిన లాక్ డౌన్ అమలు చేసింది

Corona in China: చైనాలో మరోసారి కరోనా విలయతాండవం: వైరస్ కేంద్రంగా షాంఘై నగరం

Chian

Corona in China: కరోనా వైరస్ పుట్టినిల్లుగా చెప్పబడుతున్న చైనాలో మరోసారి మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతుంది. చైనాలోని తూర్పు ప్రాంతంలో గత రెండు వారాలుగా ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కఠిన లాక్ డౌన్ అమలు చేసింది చైనా ప్రభుత్వం. అయితే చైనా ఆర్ధిక రాజధాని షాంఘై నగరంలో ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తుంది. చైనాకు విశ్వనగరంగా పిలిచే షాంఘైలో ఉన్నట్టుండి కరోనా కేసులు పెరుగుతుండడంపై అక్కడి అధికారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. ఆదివారం ఒక్కరోజే షాంఘై నగరంలో 13 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.

Also read:Telangana Corona Cases News : తెలంగాణలో కొత్తగా 7 కరోనా కేసులు

అసలు కరోనా పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో 2019 కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి ఆదేశంలో ఇదే అత్యధిక సంఖ్య కావడం గమనార్హం. కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతుండడంతో షాంఘై నగరంలో కఠిన ఆంక్షలు విధించారు. ప్రయాణాలు నిషేదించారు. ఎయిర్ పోర్ట్, సీ పోర్ట్, రైలు మార్గాల ద్వారా నగరానికి వచ్చేవారిపై ప్రత్యేక ఆంక్షలు విధించారు. కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి మూకుమ్మడి పరీక్షలు నిర్వహిస్తూ..ప్రజా కదలికలపై ఆంక్షలు విధించారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ దేశంలో ఒక్క మరణం కూడా సంభవించలేదని చైనా జాతీయ ఆరోగ్యశాఖ తెలిపింది.

Also read:Corona 4th Wave : కరోనా కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ వేగంగా వ్యాపిస్తుంది- WHO

చైనాకు విశ్వనగరంగా ప్రసిద్ధి చెందిన షాంఘై నగరంలో సుమారు రెండున్నర కోట్ల మంది జనాభా ఉంటున్నారు. చైనా ఆర్ధిక వ్యవస్థకు ఆయువుపట్టుగా పిలిచే ఈనగరం..ఇప్పుడు లాక్ డౌన్ ధాటికి వెలవెలబోతుంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు. నిత్యావసరాలు ప్రభుత్వ సిబ్బందే ఇంటికి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా కరోనాను అంతమొందించడంలో “సున్నా పాలసీ” విధానం ద్వారా ముందుకు వెళ్తున్న చైనా ప్రభుత్వానికి ప్రస్తుతం మహమ్మారి వ్యాప్తి మరింత తలనొప్పిగా మారింది.

Also Read:Vladmir Putin: పుతిన్ కు క్యాన్సర్, జింక కొమ్ముల రక్తంతో స్నానం చేస్తాడు: రష్యా పత్రిక సంచలన ప్రకటన