Chile Fire: చిలీ అడవుల్లో చెలరేగిన మంటలు.. అదుపు చేసే క్రమంలో 13మంది మృతి
చిలీ దేశంలో వేసవి తీవ్రత ఎక్కుగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మంటలు చెలరేగాయని, వందలాది గృహాలు దెబ్బతిన్నాయని చిలీ ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతాయని అధికారులు పేర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో మంటలు అదుపుచేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బందితో సహా 13 మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Chile Fire: చిలీలో అటవీ ప్రాంతాల్లోమంటలు చెలరేగుతున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న అగ్నికీలలకు స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వేసవి వేడిగాలులు కారణంగా దక్షిణ మధ్య చిలీలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయి. చిలీ రాజధాని శాంటియాగోకు దక్షిణంగా సుమారు 500 కి.మీ దూరంలో ఉన్న బయోబియోలోని శాంటా జువానా పట్టణం పరిసర ప్రాంతాల్లో మంటలను అదుపుచేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బందితో సహా 11 మంది మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు. అదేవిధంగా లా అరౌకానియాలోని దక్షిణ ప్రాంతంలో మంటలను అదుపుచేసే క్రమంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్, మెకానిక్ మరణించారు. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ఎగిసిపడిన మంటల కారణంగా 13 మంది మరణించినట్లు చిలీ ప్రభుత్వం తెలిపింది.
Fire Accdient in Russia: రష్యాలోని కోస్ట్రోమా నగరంలో కేఫ్‌లో అగ్నిప్రమాదం.. 15 మంది మృతి
చిలీ దేశంలో వేసవి తీవ్రత ఎక్కుగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మంటలు చెలరేగాయని, వందలాది గృహాలు దెబ్బతిన్నాయని చిలీ ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతాయని అధికారులు పేర్కొంటున్నారు. బయోబియో, పొరుగున ఉన్న నబుల్‌లోని వ్యవసాయం, అటవీ ప్రాంతాలలో విపత్తు పొంచిఉందని, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ముందస్తుగా సైనికులు, అదనపు వనరులను ఆ ప్రాంతాల్లో మోహరించేందుకు అధికారులు దృష్టిసారించారు. ఇదిలాఉంటే దేశంలో మొత్తం 151 ప్రాంతాల్లో మంటలు చెలరేగగా.. 65 ప్రాంతాల్లో అదుపులోకి వచ్చాయి. 39 ప్రాంతాల్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది కృషిచేస్తున్నారు.
Fire Broke Out Dubai : దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం.. బుర్జ్ ఖలీఫా సమీపంలో మంటలు
ప్రెసిడెంట్ గాబ్రియేల్ బోరిక్ న్యూబుల్, బయోబియోల్ ప్రాంతాల్లో పర్యటించారు. అత్యవసర పరిస్థితుల్లో అన్ని వనరులు అందుబాటులో ఉండేలా చూస్తామని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారికి రక్షణ కల్పిస్తామని బోరిక్ చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగానూ మంటల చెలరేగడానికి కారణం అయ్యి ఉండొచ్చని బోరిక్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై దృష్టిసారించేలా అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
Para mantener la seguridad de los hogares y apoyar evacuación en zonas rurales afectadas por los incendios forestales, @Carabdechile continúa patrullajes preventivos en las regiones de Ñuble y Biobío. En conjunto enfrentamos la emergencia. pic.twitter.com/p5Y2nu0Puu
— Presidencia de Chile (@Presidencia_cl) February 3, 2023