Russia Ukraine war: ఉక్రెయిన్ తిరిగి తమ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది: అమెరికా

దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యాను ఎదుర్కొని, తమ దేశాన్ని రక్షించుకునే క్రమంలో ఉక్రెయిన్ సైన్యం భీకరంగా పోరాడుతుతోందని చెప్పారు. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగంలో చాలా భాగాన్ని ఉక్రెయిన్ గత ఐదు రోజుల్లో తిరిగి స్వాధీనం చేసుకుందని అమెరికా వార్తా పత్రికలు కూడా తెలిపాయి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధించేందుకు తాము సాయాన్ని కొనసాగిస్తామని జీన్-పియర్ అన్నారు.

Russia Ukraine war: ఉక్రెయిన్ తిరిగి తమ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది: అమెరికా

Russia-Ukraine war

Russia Ukraine war: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్ కు తమ దశం సాయం చేస్తూనే ఉంటుందని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. రష్యా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి ఉక్రెయిన్ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ కు అమెరికా మిలటరీ, సాంకేతిక సాయాన్ని అందిస్తోంది.

దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యాను ఎదుర్కొని, తమ దేశాన్ని రక్షించుకునే క్రమంలో ఉక్రెయిన్ సైన్యం భీకరంగా పోరాడుతుతోందని చెప్పారు. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగంలో చాలా భాగాన్ని ఉక్రెయిన్ గత ఐదు రోజుల్లో తిరిగి స్వాధీనం చేసుకుందని అమెరికా వార్తా పత్రికలు కూడా తెలిపాయి.

ఈ యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధించేందుకు తాము సాయాన్ని కొనసాగిస్తామని జీన్-పియర్ అన్నారు. తమ దేశ అధ్యక్షుడు బైడెన్ కూడా ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారని ఆమె తెలిపారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ, ప్రపంచంలో అస్థిరత్వం తీసుకువచ్చేలా రష్యా చర్యలు ఉన్నాయని ఆమె చెప్పారు. సార్వభౌమ అధికార దేశంపై రష్యా పాల్పడిన రెచ్చగొట్టే చర్యల వల్లే ఆ యుద్ధం జరుగుతోందని అన్నారు.

Woman Beats Dog : బాబోయ్.. మనిషేనా? కుక్కపిల్లను గాల్లోకి లేపి ఎలా నేలకేసి బాదిందో చూడండి.. వీడియో వైరల్