Biden Warn to China : తైవాన్‌ జోలికొస్తే సహించేది లేదంటూ చైనాకు అమెరికా వార్నింగ్..

రష్యా-యుక్రెయిన్‌ యుద్ధం...కొనసాగుతోంది. శ్రీలంకలాంటి దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయాయి. అది సరిపోనట్టు ఇప్పుడు చైనా, తైవాన్‌కు రెడ్‌ సిగ్నల్స్‌ పంపుతోంది. ఇలాంటి టైమ్‌లో హఠాత్తుగా చైనాకు బైడెన్‌ ఇచ్చిన గట్టి వార్నింగ్‌ దేనికి సంకేతం? యుక్రెయిన్ కు డైరెక్ట్ గా సహాయం చేయని అమెరికా..తైవాన్ విషయంలో చైనాతో ఢీ అంటే ఢీ అనటానికి కారణమేంటి?

Biden Warn to China : తైవాన్‌ జోలికొస్తే సహించేది లేదంటూ చైనాకు అమెరికా వార్నింగ్..

Biden Warn Us Would Respond 'militarily' If China Attacked Taiwan

Biden Warn US would respond ‘militarily’ if China attacked Taiwan : రష్యా-యుక్రెయిన్‌ యుద్ధం…నాన్‌స్టాప్‌గా నడుస్తూనే వుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై దాని ఎఫెక్ట్‌ తీవ్రంగా పడుతూనే వుంది. శ్రీలంకలాంటి దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయాయి. అది సరిపోనట్టు ఇప్పుడు చైనా, తైవాన్‌కు రెడ్‌ సిగ్నల్స్‌ పంపుతోంది. ఇలాంటి టైమ్‌లో హఠాత్తుగా చైనాకు బైడెన్‌ ఇచ్చిన గట్టి వార్నింగ్‌ దేనికి సంకేతం? యుక్రెయిన్ కు డైరెక్ట్ గా సహాయం చేయని అమెరికా..తైవాన్ విషయంలో చైనాతో ఢీ అంటే ఢీ అనటానికి కారణమేంటి?

ఒక యుద్ధం నడుస్తూనే వుంది… మరో యుద్ధానికి వైబ్రేషన్స్‌ స్టార్ట్ అయినట్లు క్లియర్‌ కట్‌గా కన్పిస్తోంది. తైవాన్‌పై చైనా దాడిచేస్తే…అడ్డుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇచ్చిన వార్నింగ్‌…ఏదో జరగబోతున్న దానికి సంకేతమని స్పష్టమవుతోంది. నిజానికి గత ఏడాది నుంచే తైవాన్‌పై కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు చైనా వ్యవహారమే బయటపెట్టింది. ఆ దేశానికి చెందిన యుద్ధ విమానాలు తైవాన్ భూభాగంలో రౌండ్లేశాయి. తైవాన్.. చైనాలో సహజసిద్ధ భూభాగమని…ఎప్పటికైనా తైవాన్‌ను చైనా స్వాధీనం చేసుకుంటుందని అధ్యక్షుడు జిన్‌పింగ్ పలుమార్లు ప్రకటించారు. అదే జరిగితే మొదటికే మోసం వస్తుందని, తమ ప్రయోజనాలు నేలమట్టం అవుతాయని భావించిన అమెరికా…యుక్రెయిన్‌లా తైవాన్‌కు సాయంతో సరిపెట్టబోమని, అవసరమైతే ప్రత్యక్షంగా యుద్ధరంగంలోకి దిగుతామని తాజాగా చైనాకు వార్నింగ్‌ ఇచ్చింది. తైవాన్ జోలికి వెళ్లడమంటే నిప్పుతో చెలగాటమాడటమే అని హెచ్చరించింది.

Also read : Uyghurs in China: చైనాలో “ఉయ్ఘర్స్ నిర్బంధ శిబిరాలు”: జింజియాంగ్ ప్రాంతంలో యూఎన్ ప్రతినిధి పర్యటన

తైవాన్‌పై చైనా దూకుడును అమెరికా ఎందుకు వ్యతిరేకిస్తోంది? అంటే… సాధారణంగా అంతర్జాతీయ సంబంధాల విషయంలో.. ఆర్థిక శక్తి, వ్యూహాత్మక, సైద్ధాంతిక కారణాలతోనే చిన్న దేశాలకు పెద్ద దేశాలు అండగా నిలుస్తాయి, హామీ ఇస్తాయి. తైవాన్- అమెరికా సంబంధాల విషయంలో ఆ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఎందుకంటే అమెరికాకు పదవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలుస్తోంది తైవాన్. ఈ ప్రాంతం చైనా ఆధీనంలోకి వెళ్తే.. 600 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, హైటెక్ పరిశ్రమ, సెమీకండక్టర్ ఉత్పత్తిపై డ్రాగన్ దేశం పట్టు సాధిస్తుంది. దీనికి తోడు చైనా నియంత్రణలోకి తైవాన్ వెళ్తే.. ఈ ప్రాంతానికి తూర్పు వైపు 150 నాటికల్ మైళ్ల దూరంలో క్షిపణి పరిధిని పెంచుకునే అవకాశం చైనాకు దక్కుతుంది. ఇది చైనాను తూర్పు చైనా సముద్రంలో మరింత శక్తివంతం చేస్తుంది. దీంతోపాటు ఆ దేశం జపాన్ లేదా యూఎస్ ద్వీపం భూభాగమైన గువామ్‌పై దాడి చేయడం సులభం అవుతుంది. అందువల్ల తైవాన్‌ పునరేకీకరణను అమెరికా సమర్థించేందుకు ఇష్టపడటం లేదు. ఈ కారణాల వల్లే తైవాన్‌ తమకు అత్యంత ముఖ్యమైన మిత్రదేశమని యూఎస్ భావిస్తోంది.

యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసినట్లు…తైవాన్‌ను ముట్టడిస్తూ చైనా కూడా రష్యా లాగే ఆర్థిక, దౌత్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరుగుతుంది. అదే క్షణంలో…. తైవాన్ అధికారికంగా స్వతంత్ర్యం ప్రకటించుకోవడం కూడా అసంభవమనే వాదన కూడా వినబడుతోంది. చాలా మంది తైవానీస్ ప్రజలు యథాతథ స్థితికి మద్దతు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్య్రం ప్రకటించుకుంటే, చైనా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడకపోవచ్చని వారు భావిస్తున్నారు. అందుకూ తైవాన్‌-చైనాల మధ్య భవిష్యత్తులో కూడా యథాతథ స్థితి కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని వాదన బలంగా విన్పడుతోంది.

Also read : Monkeypox : ప్రపంచానికి మంకీపాక్స్ ముప్పు తప్పదా?కరోనాను మించిన పరిస్థితులు చూడబోతున్నామా?

వాస్తవానికి కొంత మంది తైవాన్‌ వాసులు చైనాతో పునరేకీకరణకు మద్దతు ఇస్తున్నారు. ఓ సర్వే ప్రకారం… తైవాన్ నివాసితులలో దాదాపు మూడింట రెండు వంతుల మంది తమ గుర్తింపును కేవలం ‘తైవానీస్’ గానే పరిగణిస్తున్నారు. కేవలం మూడు శాతం మంది మాత్రమే తమను తాము ‘చైనీయులు’గా భావిస్తున్నారు. అయితే తైవానీస్ గుర్తింపు అనే బలమైన భావన.. చైనాతో తైవాన్ పునరేకీకరణకు అవరోధంగా మారుతోంది. తైవాన్ భవిష్యత్తయిన లక్షలాది మంది తైవానీస్ యువకులు.. తమకు చైనాతో ఎలాంటి సాంస్కృతిక సంబంధాలు లేవని భావిస్తున్నారు. దానికితోడు చాలా మంది తైవానీస్ ప్రజలు “ఒక దేశం- రెండు వ్యవస్థలు” విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే తైవాన్ ప్రజలు స్వేచ్ఛను కోరుకునే వారు. అందుకే పునరేకీకరణ తర్వాత తైవాన్‌కు స్వయంప్రతిపత్తిని ఇస్తామన్న చైనా వాగ్దానాన్ని వారు నమ్మడం లేదు. ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు హాంకాంగ్‌ విషయంలో చైనా తీరును ఉదహరిస్తున్నారు.