WHO On Omicron : ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచండి.. ప్రపంచ దేశాలకు WHO సూచన

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని.. ప్రపంచ దేశాలు ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని who తెలిపింది

WHO On Omicron : ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచండి.. ప్రపంచ దేశాలకు WHO సూచన

Who On Omicron

WHO On Omicron : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుంది. సౌత్ ఆఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త రూపం ప్రపంచ దేశాలను హడలిస్తోంది. ప్రస్తుతం 89 దేశాల్లో ఈ వేరియంట్ కేసులు వెలుగు చూసినట్లు WHO (world health organization) తెలిపింది. ఈ ఒమిక్రాన్‌పై WHO ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ వేరియంట్ సోకిన ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఒకరి నుంచి రెండు రోజుల్లోనే రెట్టింపు అవుతున్నట్లు WHO గుర్తించింది. దీనిని కట్టడి చేసేందుకు గ్రామస్థాయిలోనే ప్రజారోగ్య చర్యలు మరింత ముమ్మరం చేయాలనీ సూచించింది.

చదవండి : WHO : ఒమిక్రాన్‌పై అతిగా స్పందించొద్దు..దక్షిణాఫ్రికాను శిక్షించొద్దు

ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉన్నా.. కేసుల సంఖ్య పెరిగితే ఆస్పత్రులపై మళ్ళీ ఒత్తిడి పెరుగుతుందని, ఒత్తిడి లేకుండా ఉండేందుకు వైద్య సిబ్బంది, బెడ్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది WHO. వ్యాక్సినేషన్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. కోవిడ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో బూస్టర్‌ డోసుల అంశాన్ని పరిశీలించాలని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే బూస్టర్‌ డోసులు తీసుకున్న దేశాలు పేద దేశాలకు టీకాలు ఉదారంగా పంపిణీ చేసి ఆదుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ఈ సమయంలో పేద దేశాల పట్ల తమ ప్రేమను చాటుకోవాలని తెలిపింది WHO.

చదవండి : Omicron : ఒమిక్రాన్ తో తీవ్ర ముప్పు..ప్రపంచదేశాలకు WHO హెచ్చరిక