Brazil Drug Market : కూరగాయలు అమ్మినట్లు డ్రగ్స్ అమ్మేస్తున్నారు.. ఎక్కడంటే?
ఆ మార్కెట్‌ను బయట నుంచి చూసి కూరగాయల మార్కెట్ అనుకుంటే పొరపాటే. లోపల భారీ డ్రగ్స్ మార్కెట్ నడుస్తోంది. అలాంటి ప్లేస్‌కి ధైర్యంగా వెళ్లడమే కాదు.. అక్కడ జరుగుతున్న దందా అంతా కెమెరాతో షూట్ చేశాడు ఓ యూట్యూబర్. ఆ వీడియో చూసిన జనం షాకవుతున్నారు.

Brazil Drug Market
Brazil’s drug market sensational video : మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా నియంత్రించలేకపోతున్నాయి. భద్రతా సంస్థల కన్నుగప్పి డ్రగ్స్ దందాలు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కూరగాయల మార్కెట్‌ను తలపిస్తున్న ఓ భారీ డ్రగ్ మార్కెట్‌ను ఓ యూట్యూబర్ వీడియో తీసి షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
Anju Krishna : డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయిన సౌత్ యాక్ట్రెస్..
బ్రెజిల్‌లో ఓ భారీ డ్రగ్ మార్కెట్ చూస్తే అందరూ షాకవుతారు. కూరగాయలు అమ్మినట్లు అక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారు. నిజానికి ఆ ప్రాంతానికి వెళ్లడం.. అక్కడ జరుగుతున్న దందాను చిత్రీకరించడం అంటే చాలా గట్స్ ఉండాలి. ఓ యూట్యూబర్ పెద్ద సాహసం చేసాడనే చెప్పాలి. ధైర్యంగా లోనికి వెళ్లి వీడియో తీశాడు. @clipsthatgohard అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియో చూసిన జనాలు షాకవుతున్నారు.
యూట్యూబర్ లోనికి వెళ్లి రహస్యంగా వీడియోని షూట్ చేశారు. వీడియోలో అతను అడుగుతున్న ప్రకారం 3 గ్రాముల కొకైన్ మార్కెట్‌లో రూ.330 కి అమ్ముతున్నారు. అదే మొత్తం కొకైన్ లండన్‌లో రూ. 16000 ధర పలుకుతుందట. అక్కడి కొకైన్ కొని యూరోపియన్ మార్కెట్ లో అమ్ముకోమని అది విక్రయిస్తున్నవాడు సలహా ఇస్తున్నాడు.
వీడియోని చూసిన ట్విట్టర్ ఖాతాదారులు ఆశ్చర్యపోయారు. మరికొంతమంది భయపడ్డారు కూడా. ఇక యూట్యూబర్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు కూడా.. ఎందుకంటే ఏ మాత్రం అతను షూట్ చేస్తున్నాడని తెలిసినా ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే.
youtuber visits an open drug market deep in a brazilian favela run by notorious gangs pic.twitter.com/aGXFopYHE1
— clips that go hard (@clipsthatgohard) May 11, 2023