Maha vs Karnataka: మమ్మల్ని కర్ణాటక రాష్ట్రంలో కలిపేయండి.. మహా ప్రభుత్వానికి షాకిస్తూ లేఖ రాసిన 11 గ్రామాలు

ఆయా గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా పడకేసిందట. రోడ్లు లేవు, పాఠశాలలు సరిగా లేవు, వైద్య సదుపాయం ఊసే లేదు. దీంతో తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వేరే రాష్ట్రంలో అయినా కలిపేస్తే తమ గ్రామాల్లో ఏమైనా మార్పులు రావొచ్చని ఆయా గ్రామస్తులు అంటున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా అక్కల్‭కోట్ తాలుకాలోని 11 గ్రామాలు డిసెంబర్ 5న మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి.

Maha vs Karnataka: మమ్మల్ని కర్ణాటక రాష్ట్రంలో కలిపేయండి.. మహా ప్రభుత్వానికి షాకిస్తూ లేఖ రాసిన 11 గ్రామాలు

11 Villages In Maharashtra Demand Merger With Karnataka Amid Border Row

Maha vs Karnataka: ఇప్పటికే సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు హోరాహోరి మీద యుద్ధం చేస్తున్నాయి. మీవైపు ఉన్న మరాఠ మాట్లాడే ప్రాంతాలు మావి అని అటు మహారాష్ట్ర, మీవైపు ఉన్న కన్నడ మాట్లాడే ప్రాంతాలు మావి అని ఇటు కర్ణాటక.. మాకిచ్చేయాలి అంటే, మాకిచ్చేయాలి అంటూ హోరాహోరీగా వాదనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్రంలోని 11 గ్రామాలు గట్టి షాకిచ్చాయి. తమను కర్ణాటక రాష్ట్రంలో కలిపేయండంటూ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికే లేఖ రాశాయి. అయితే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు భాషా ప్రాతిపదికన సరిహద్దు వివాదం కొనసాగిస్తున్నాయి. అయితే తమను కర్ణాటకలో కలిపేయమంటూ డిమాండ్ చేసిన గ్రామాలు మాత్రం భాషా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి ప్రాతిపదికన కోరాయి.

ఆయా గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా పడకేసిందట. రోడ్లు లేవు, పాఠశాలలు సరిగా లేవు, వైద్య సదుపాయం ఊసే లేదు. దీంతో తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వేరే రాష్ట్రంలో అయినా కలిపేస్తే తమ గ్రామాల్లో ఏమైనా మార్పులు రావొచ్చని ఆయా గ్రామస్తులు అంటున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా అక్కల్‭కోట్ తాలుకాలోని 11 గ్రామాలు డిసెంబర్ 5న మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. ఆ లేఖలో ‘‘రోడ్లు సరిగా లేవు, నాణ్యత విద్య అందుబాటులో లేదు, కనీస వైద్య సదుపాయాలు లేవు.. ప్రజల నివాసానికి కావాల్సిన కనీస అవసరాలు అందుబాటులో లేవు.. ఇవన్నీ వీలైనంత తొందరగా తీర్చండి. లేదంటే మమ్మల్ని వేరే రాష్ట్రంలో కలిపేయండి’’ పేర్కొన్నాయి.

400 files Stolen In Court : కోర్టు కబోర్డు నుంచి 400ల ఫైళ్లు మాయం..! చోరీయా? కుట్రా? పోలీసుల దర్యాప్తులో ఏం తేలనుంది?

ఈ విషయమై 11 గ్రామాలలో ఒకటైన అగ్లేగావ్ సర్పంచ్ మంటస్ హతురే మాట్లాడుతూ ‘‘మమ్మల్ని కర్ణాటకలో విలీనం చేయాలని మా గ్రామ పంచాయతీ సమావేశంలో తీర్మానం చేశాం. అందులో నేను కూడా పాల్గొన్నాను. మాకు మంచి రోడ్లు లేవు. విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థలతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అందుకే మేము కర్ణాటక రాష్ట్రంలో కలవాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేసింది. అందుకు మేము చాలా బాధపడుతున్నాం. కర్ణాటకలో కలిస్తే మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం’’ అని అన్నారు.

ఈ లేఖలు మహారాష్ట్రను రాజకీయంగా కుదిపివేశాయి. స్థానిక అక్కల్‭కోట్ ఎమ్మెల్యే, బీజేపీ నేత సచిన్ కల్యాణశెట్టి స్పందిస్తూ తాము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, అయితే అవి పూర్తిగా ప్రజల్లోకి రావడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. తొందర పడొద్దని కోరారు. గ్రామ ప్రజలతో తాను మాట్లాడతానని, వారిని అభివృద్ధితోనే సంతృప్తి పరుస్తానని ఎమ్మెల్యే సచిన్ కల్యాణశెట్టి అన్నారు.

Maharashtra Vs Karnataka : మరింత ముదిరిన మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం.. దీని వెనుక గల కారణాలు