2021 Top Telugu Songs: ఈ ఏడాది ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన పాటలివే!

ఔట్ ఆఫ్ హై రికార్డ్స్.. కొన్ని సూపర్ సాంగ్స్ 2021లో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేశాయి. సినిమా, యూట్యూబ్ అని తేడా లేకుండా జనాల నోళ్లలో బాగా నానాయి. వాటిలో కొన్ని మెలోడీస్ ఉన్నాయి.

2021 Top Telugu Songs: ఈ ఏడాది ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన పాటలివే!

2021 Top Telugu Songs

2021 Top Telugu Songs: ఔట్ ఆఫ్ హై రికార్డ్స్.. కొన్ని సూపర్ సాంగ్స్ 2021లో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేశాయి. సినిమా, యూట్యూబ్ అని తేడా లేకుండా జనాల నోళ్లలో బాగా నానాయి. వాటిలో కొన్ని మెలోడీస్ ఉన్నాయి.. కొన్ని ఫోక్ సాంగ్స్ అద్దరగొట్టాయి. మొత్తానికి 2021లో గుర్తుండిపోయేలా కొన్ని పాటలు జనల నోళ్ళలో నానుతూ చెవుల్లో మార్మ్రోగిపోయాయి. 2021 స్టార్టింగ్ లోనే జనాన్ని ఊపేశాయి ఉప్పెన పాటలు. ఈ సినిమాలోని ప్రతి పాటకు ఫిదా అయిపోయారు ఆడియెన్స్. దేవీశ్రీ ప్రసాద్ నిజంగా యూత్ కి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ బాక్స్ ను ఉప్పెనతో ఈ ఇయర్ ఇచ్చేశాడు.

Top 10 Most Viewed Telugu Songs: పాట నచ్చిందా.. హీరోలకు రికార్డులు కట్టబెడుతున్న నెటిజన్లు

ఆ తర్వాత అంతలా మెస్మరైజ్ చేసిన సాంగ్ యాంకర్ ప్రదీప్ హీరోగా వచ్చిన 30రోజుల్లో ప్రేమించటం ఎలా లోనిది. ప్రదీప్ సినిమాకి ఓపెనింగ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఆ పాటే మరి. 2021 స్టార్టింగ్ నుంచే సిద్ శ్రీరామ్ పాటలు జనానికి ఫుల్ గా కనెక్ట్ అయిపోయాయి. నీలి నీలి ఆకాశం తర్వాత శశి సినిమాలోని ఒకే ఒక లోకం నువ్వుతో పాటూ అర్ధ శతాబ్ధం, రంగ్ దే సినిమాల్లోని పాటలు ఫుల్ గా ట్రెండ్ అయ్యాయి. అంతేకాదు అఖిల్ కి హిట్ ఇచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లోని సిద్ శ్రీరామ్ లెహరాయి 2021 సూపర్ హిట్ గా నిలిచింది.

RRR: నెవెర్ బిఫోర్ అనేలా తారక్-చరణ్.. ఓ తప్పస్సులా ప్రమోషన్లు!

2021 బ్లాక్ బస్టర్ మూవీ జాతిరత్నాలు లోని చిట్టీ సాంగ్ గట్టిగానే ప్రభంజనం సృష్టించింది. రామజోగయ్య వాడిన వెరైటీ పదాలకు రామ్ మిరియాల గొంతు తోడై రిపీట్ మోడ్ లో జనాలు వినేలా చేసింది. అంతకు మించి రథన్ మ్యూజిక్ క్యాచీగా ఉండటంతో చాలా రోజుల వరకు మ్యూజిక్ లవర్స్ టాప్ లిస్ట్ లో ఉంది. వకీల్ సాబ్ లోని మగువా మగువా సాంగ్ లేడీస్ రేంజ్ పెంచితే.. వాళ్లతో స్టెప్పులేయించేలా చేసింది లవ్ సోరీలోని సారంగ దరియా. మంగ్లీ పాడిన ఈ పాటకు సాయి పల్లవి స్టెప్పులు తోడై యూత్ లో జోష్ తీసుకొచ్చింది. కవర్ సాంగ్స్, షార్ట్స్ వంటి వాటితో సోషల్ మీడియాను నింపేశారు జనాలు. ఇదొక్కటే కాదు మంగ్లీ పాడిన క్రాక్, సీటీమార్, రంగ్ దే, పెళ్లి సందడి సినిమాలోని పాటలు సైతం బాగానే అట్రాక్ట్ చేశాయి.

Jabardasth Varsha: అల్లరి చూపుల వర్ష.. అందుకు తగ్గ అందం!

నాగశౌర్య, రీతూవర్మ జంటగా వచ్చిన వరుడు కావలెనులోని దిగు దిగు సాంగ్ సైతం సోషల్ మీడియాలో 2021లో బాగానే వైరలయింది. టక్ జగదీష్ ఇంకోసారి సైతం మ్యూజిక్ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసింది. శ్రీకారం, నల్లమల్ల, రెడ్, శ్రీదేవి సోడా సెంటర్, పాగల్ లాంటి సినిమాల్లోని కొన్ని పాటలు కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. ఇక సినిమా సాంగ్స్ కాకుండా కొన్ని యూట్యూబ్ సాంగ్స్ ఈ ఇయర్ ఫుల్ గా ట్రెండ్ అయ్యాయి.

Senapathi: పోలీసోడు గన్ పోగొట్టుకుంటే.. ఉత్కంఠగా సేనాపతి ట్రైలర్!

సింగర్ శిరీష పాడిన బావల్ల పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీప్తి సునయన తట్టుకోలేదే బ్రేకప్ సాంగ్, సాత్విక రాజ్ నీతో, గున్నా గున్నా మావిళ్లల్ల, వెళ్లురా ఓ మనిషి వెళ్లురా, ఉంగురమే వంటి పాటలు యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మరీ మఖ్యంగా చెప్పుకోవాల్సింది బుల్లెట్ బండి పాట గురించి. మోహన భోగరాజ్ పాడిన బుల్లెటు బండి పాట లేనిది ఇప్పుడు ఏ పెళ్లి జరగట్లేదంటే అది నిజం. ఆ మధ్య ఎక్కడ చూసినా ఇదే పాటకి స్టెప్పులు.. ఎక్కడ విన్నా బుల్లెట్ బండి కూతలు అన్నట్టు ఉండేది.