Ayodhya Rama : 21కేజీల వెండి ఊయ‌లలో దర్శనమివ్వనున్న అయోధ్య రామయ్య

అయోధ్య రామయ్య త్వరలో వెండి ఊయలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అత్యంత పుణ్యమాసమైన శ్రావ‌ణ‌మాసంలో అయోధ్య శ్రీరాముడు వెండి ఉయ్యాల‌లో ద‌ర్శ‌న‌మిస్తారు. భ‌క్తులు మంగ‌ళ‌క‌ర‌మైన గీతాల‌ను ఆల‌పిస్తుండగా శ్రీరాముడు వెండి ఊయలలో పవళించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Ayodhya Rama : 21కేజీల వెండి ఊయ‌లలో దర్శనమివ్వనున్న అయోధ్య రామయ్య

21 Kg Silver Jhula

Updated On : August 12, 2021 / 11:54 AM IST

21 kg silver jhula in the ayodhya Sri rama : అయోధ్య రామయ్య త్వరలో వెండి ఊయలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అత్యంత పుణ్యమాసమైన శ్రావ‌ణ‌మాసంలో అయోధ్య శ్రీరాముడు వెండి ఉయ్యాల‌లో ద‌ర్శ‌న‌మిస్తారు. భ‌క్తులు మంగ‌ళ‌క‌ర‌మైన గీతాల‌ను ఆల‌పిస్తుండగా శ్రీరాముడు వెండి ఊయలలో పవళించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు.

శ్రీరాముడి కోసం ట్రస్ట్ 21 కేజీల వెండితో ఊయలనుతయారు చేయించింది. ఈ ఊయ‌ల‌ను రామ్‌ల‌ల్లాకు స‌మ‌ర్పించారు. ప్ర‌తి సంవత్సరం శ్రావ‌ణ‌మాస‌రంలో జూలోత్స‌వం నిర్వ‌హిస్తారు. దీంట్లో భాగంగా ఈ సంవత్సరం శ్రావ‌ణ శుక్ల త్రితియ నుంచి పూర్ణిమ వ‌ర‌కు శ్రీరాముడు త‌మ భ‌క్తుల‌కు ఉయ్యాల‌లోనే ద‌ర్శ‌న‌మిస్తారు. ఆ ప‌రంప‌ర‌లో భాగంగా ఈ సంవత్సరం కూడా వైభ‌వంగా జూలోత్స‌వాన్ని నిర్వ‌హించ‌నున్నారు.

ఈ ఉత్స‌వాల కోసం 21 కేజీల వెండి ఉయ్యాలను అయోధ్య మందిరంలో ఏర్పాటు చేసిన‌ట్లు శ్రీ రామ జ‌న్మ భూమి తీర్థ క్షేత్ర త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపింది. వెండి ఊయలలో పవళించే రామయ్యను దర్శించుకోవటానికి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటానికి ఉవ్విళ్లూరుతున్నారని వెల్లడించారు.