Grammy Awards : కరోనా ఎఫెక్ట్.. వాయిదా పడ్డ గ్రామీ అవార్డుల వేడుక

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్ లో జనవరి 31న నిర్వహించాల్సిన 64వ గ్రామీ అవార్డుల వేడుక కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో వాయిదా వేశారు. ఈ విషయాన్ని గ్రామీ అధికారిక కమిటీ..........

Grammy Awards : కరోనా ఎఫెక్ట్.. వాయిదా పడ్డ గ్రామీ అవార్డుల వేడుక

Grammy Awards

Grammy Awards :  ప్రస్తుతం మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనాతో పాటు ఒమిక్రాన్‌ కేసులు కూడా పెరుగుతుండటంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సినిమాలు, ఈవెంట్లు అన్ని వాయిదా పడుతున్నాయి. మరో వైపు చాలా మంది సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. మన దేశంలో ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన పాన్ ఇండియా సినిమాలన్ని వాయిదా పడ్డాయి. ఇప్పటికే ఆస్కార్ అవార్డుల వేడుక కూడా వాయిదా పడింది. తాజాగా సంగీతంలో అద్భుత ప్రదర‍్శన కనబర్చిన కళాకారులకి ఇచ్చే గ్రామీ అవార్డుల వేడుక వాయిదా పడింది.

Indraani : ఇండియన్ ఫస్ట్ సూపర్ ఉమెన్ ‘ఇంద్రాణి’

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్ లో జనవరి 31న నిర్వహించాల్సిన 64వ గ్రామీ అవార్డుల వేడుక కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో వాయిదా వేశారు. ఈ విషయాన్ని గ్రామీ అధికారిక కమిటీ, ది రికార్డింగ్‌ అకాడమీ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. అమెరికాలో కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నందున నిర్వాహకులకు, వచ్చే సెలబ్రిటీస్ కి ఇబ్బంది ఏర్పడవచ్చని, సంగీత నిర్వాకులు, ప్రేక్షకులు, సిబ్బంది ఆరోగ్య భద్రతే తమకు ముఖ్యమని అకాడమీ అధికారులు తెలిపారు. త్వరలో కొత్త తేదిని ప్రకటిస్తామని పేర్కొన్నారు.