Pet Dog: పెంపుడు కుక్కే వృద్ధురాలి ప్రాణాలు తీసిందట

ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్కనే ఆమె పాలిట శాపంగా మారింది. లక్నోలోని కైసర్‌బాగ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం 82 ఏళ్ల రిటైర్డ్ టీచర్‌ను పెంపుడు కుక్క పిట్‌బుల్ కొరికడంతో ప్రాణాలు కోల్పోయింది.

Pet Dog: పెంపుడు కుక్కే వృద్ధురాలి ప్రాణాలు తీసిందట

Pet Dog

 

Pet Dog: ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్కనే ఆమె పాలిట శాపంగా మారింది. లక్నోలోని కైసర్‌బాగ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం 82 ఏళ్ల రిటైర్డ్ టీచర్‌ను పెంపుడు కుక్క పిట్‌బుల్ కొరికడంతో ప్రాణాలు కోల్పోయింది.

ఉదయం 6 గంటల సమయంలో మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని గుర్తించిన కొడుకు.. బలరాంపూర్ ఆసుపత్రికి తరలించాడు. గాయం తీవ్రంగా కావడంతో ట్రీట్మెంట్ తీసుకుంటూనే మృతి చెందింది.

మృతురాలిని సుశీలా త్రిపాఠిగా గుర్తించారు. కైసర్‌బాగ్‌లోని బెంగాలీ తోలా ప్రాంతంలో మహిళ కుటుంబం ఉంటున్నారు. ఆమె కుమారుడైన అమిత్.. జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తూ.. రెండు కుక్కలను పెంచుకుంటున్నాడు. వాటిల్లో ఒకటి పిట్‌బుల్ మరొకటి లాబ్రడార్. మహిళపై దాడి చేసిన బ్రౌనీ అనే పిట్ బుల్ కుక్కను మూడేళ్ల క్రితం ఇంటికి తీసుకొచ్చారు.

Read Also: పెంపుడు కుక్క చనిపోయిందనే బెంగతో చిరుతను తెచ్చుకున్న యువతి

పోస్టుమార్టం నివేదిక ప్రకారం సుశీల శరీరంపై మెడ నుంచి పొత్తికడుపు వరకు మొత్తం 12 బలమైన గాయాలు ఉన్నట్లు తెలిసింది.

స్థానికుల కథనం ప్రకారం, “ఉదయం 6 గంటల సమయంలో కుక్కల అరుపులు, సుశీల కేకలు విన్నామని తెలిపారు. ఇంట్లోకి వెళ్లి చూద్దామనుకుంటే తాళం వేసి ఉంది. తన కొడుక్కి సమాచారం తెలియజేయగా అతను వచ్చి తలుపులు తెరిచాడు. అప్పుడే రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూశాం” అని వెల్లడించారు.

లక్నో నగరంలో మొత్తం 4,824 లైసెన్స్‌లు జారీ చేయగా, వాటిలో 2,370 పెద్ద జాతి కుక్కలకు సంబంధించినవి.