Cheetah In Hetero Labs : సంగారెడ్డి జిల్లాలోని హెటిరో ల్యాబ్స్ లో చిరుత పులి సంచారం

సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో చిరుత పులి కలకలం రేపుతోంది. గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో ల్యాబ్స్ లో చిరుత సంచరిస్తోంది. పరిశ్రమలోని హెచ్-బ్లాక్ లో చిరుత దాక్కున్నట్లు తెలుస్తోంది.

Cheetah In Hetero Labs : సంగారెడ్డి జిల్లాలోని హెటిరో ల్యాబ్స్ లో చిరుత పులి సంచారం

LEOPORD

cheetah in Hetero Labs : సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో చిరుత పులి కలకలం రేపుతోంది. గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో ల్యాబ్స్ లో చిరుత సంచరిస్తోంది. పరిశ్రమలోని హెచ్-బ్లాక్ లో చిరుత దాక్కున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

సమాచారం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది హెటిరో పరిశ్రమకు చేరుకుని పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు పరిశ్రమలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. చిరుత పులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని పేర్కొన్నారు.

Leopard Enters House: వామ్మో.. నేరుగా ఇంట్లోకొచ్చిన చిరుత పులి.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే..

జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చిరుతను బంధించేందుకు బోన్ ఏర్పాటు చేశారు. ఎవరూ బయటకు రాకూడదని సూచించారు. 3 నెలల క్రితం కూడా చిరుత పులి పరిశ్రమలో సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.