MLA Raghunandan Rao: ఆ వీడియో బయటపెట్టినందుకు.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..

బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జూబ్లిహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటన కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే. నింధితులను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

MLA Raghunandan Rao: ఆ వీడియో బయటపెట్టినందుకు.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..

Bjp Mla

MLA Raghunandan Rao: బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జూబ్లిహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటన కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే. నింధితులను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో బాలిక అత్యాచార సంఘటనకు సంబంధించి కొన్ని ఫొటోలను, ఒక వీడియోను బయట పెట్టారు. బెంజ్ కారులో జరిగిన దృశ్యాలను రఘునందన్ మీడియా ఎదుట బహిర్గతం చేశారు.

Hyderabad Gang Rape : గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐతో గానీ..లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : రఘునందన్ రావు

ఎమ్మెల్యే బహిర్గతం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీడియోలను బహిర్గతం చేసినందుకుగాను అబిడ్స్ పోలీసులు ఐపీసీ 228(ఏ) సెక్షన్ కింద రఘునందన్ రావుపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదిలాఉంటే బాలిక వీడియోలను బహిర్గతం చేయటంలో కీలకంగా వ్యవహారించిన సుభాన్‌ అనే వ్యక్తికి ఇప్పటికే సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం విధితమే. సుప్రింకోర్టు ఆదేశాల మేరకు అఘాయిత్యానికి గురైన బాధితుల వివరాలు బయట పెట్టొద్దు. అలాచేస్తే నేరంగా పరిగణిస్తారు. ఈ కోణంలోనే బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రఘునందన్ రావు ఈ విషయంపై స్పందించారు. తాను చూపించిన వీడియోలో ఎక్కడ బాధితురాలి ముఖం కనిపించలేదని తెలిపారు.

Hyderabad : హైదరాబాద్‌లో పబ్‌లు,బార్లకు కొత్త రూల్స్-పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్

తాజాగా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడంతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసిన విషయం విధితమే. దీంతో వారిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తీశారు..? ఎందుకు తీశఆరు అనే కోణంలో విచారించి స్పష్టత వచ్చాక బాధితులపై పోలీసులు చర్యలు తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిని కస్టడీలోకి తీసుకొని పూర్తి వివరాలను రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తరువాతనే ఈ కేసులో తెరవెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరున్నారనే విషయాలపై స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.