IND vs BAN 2nd Test: అశ్విన్ – అయ్యర్ 71 పరుగుల భాగస్వామ్యంతో 90ఏళ్ల నాటి రికార్డు..

1985 సంవత్సరంలో కొలంబో క్రికెట్ గ్రౌండ్ లో భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 8వ వికెట్ కు కపిల్ దేవ్ - శివరామకృష్ణ 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 1932లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాల్ సింగ్ - అమర్ సింగ్ 8వ వికెట్ కు 74 పరుగులు జోడించారు.

IND vs BAN 2nd Test: అశ్విన్ – అయ్యర్ 71 పరుగుల భాగస్వామ్యంతో 90ఏళ్ల నాటి రికార్డు..

ashwin vs shreyas iyer

Updated On : December 25, 2022 / 7:43 PM IST

IND vs BAN 2nd Test: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో టీమిండియా విజయం సాధించడంతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మొదటి టెస్టు లో బంగ్లా జట్టుపై సునాయస విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టులో మాత్రం బ్యాటర్ల పేలువ ప్రదర్శనతో ఓటమి అంచుల నుంచి బయటపడి అతికష్టంమీద విజయాన్ని దక్కించుకుంది. రెండో టెస్టు మ్యాచ్ లో విజయం సాధించాలంటే టీమిండియా 145 పరుగులు సాధించాలి. ఈ క్రమంలో బంగ్లా బౌలర్ల దాటికి టాప్ ఆర్డర్ బ్యాటర్లు తక్కువ స్కోర్లకు పెవిలియన్ బాటపట్టారు. నాల్గోరోజు ఆటలోనూ భారత్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో 74 పరుగులకే ఏడు వికెట్లును టీమిండియా కోల్పోయింది.

India vs Bangladesh: రెండో టెస్టులో భారత్ ఘన విజయం.. మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలుపు

బంగ్లాదేశ్ గెలవాలంటే మరో మూడు వికెట్లు తీయాల్సి ఉంది. ఇండియా ఓటమి దాదాపు ఖాయమవుతుందని అనుకుంటున్న సమయంలో శ్రేయాస్ అయ్యర్, రవిచంద్ర అశ్విన్ జోడీ అద్భుత ఆటతీరును కనబర్చి 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాయి. చివరి వరకు వికెట్ పడకుండా వీరి భాగస్వామ్యం కొనసాగడంతో భారత్ రెండో టెస్టు లో ఓటమి నుంచి తప్పించుకొని అతి కష్టం మీద విజయం సాధించింది. దీంతో టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.

india vs bangladesh test Match: టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా .. ఫొటో గ్యాలరీ

ఈ మ్యాచ్‌లో 8వ వికెట్‌కు అశ్విన్ – శ్రేయాస్ 71 పరుగుల భాగస్వామ్యం గత భారత్ రికార్డును తిరగరాసింది. 1985 సంవత్సరంలో కొలంబో క్రికెట్ గ్రౌండ్ లో భారత్ – శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 8వ వికెట్ కు కపిల్ దేవ్ – శివరామకృష్ణ 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 1932లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాల్ సింగ్ – అమర్ సింగ్ 8వ వికెట్ కు 74 పరుగులు జోడించారు. ప్రస్తుతం అశ్విన్ – శ్రేయాస్ జోడీ 8వ వికెట్ కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి కపిల్ – శివరామకృష్ణ భాగస్వామ్యంతో ఉన్న రికార్డును అధిగమించింది.