Actor Naresh : సినీ నటుడు నరేష్ ఇంటిపై దాడి.. కారు ధ్వంసం!

టాలీవుడ్ యాక్టర్ నరేష్, తన మూడో భార్యతో విడాకుల విషయంలో గొడవ పడుతూ సంగతి తెలిసిందే. తాజాగా నరేష్ ఇంటి పై దాడి జరగగా, అది తన భార్య రమ్యనే చేయించింది అంటూ పోలీసులను ఆశ్రయించాడు.

Actor Naresh : సినీ నటుడు నరేష్ ఇంటిపై దాడి.. కారు ధ్వంసం!

Actor Naresh

Actor Naresh : టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్.. తన సహా నటి పవిత్రా లోకేశ్ తో గత కొంత కాలంగా సహజీవనం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల వీరిద్దరూ పెళ్లితో ఒకటి కాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే వీరిద్దరి సంబంధం గురించి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. విడాకులు ఇవ్వాలి అంటూ నరేష్, రమ్యని కోరుతున్నా.. ఆమె మాత్రం విడాకులు ఇచ్చేది లేదు. నరేష్, పవిత్ర పెళ్లి జరగనిచ్చేది లేదు అంటుంది రమ్య రఘుపతి.

Actor Naresh : సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు నటుడు నరేశ్.. ఆ కేసు దర్యాఫ్తులో పురోగతిపై ఆరా

ఈ నేపథ్యంలో వీరిద్దరి గొడవ మీడియా వరకు చేరి రచ్చ రచ్చ అవుతుంది. ఇటీవల తన మూడో భార్య రమ్య నుంచి ప్రాణహాని ఉందని నరేశ్ కూకట్‌పల్లి కోర్టుని ఆశ్రయించాడు. తన ఆస్తి కాజేయడానికి ప్రయత్నిస్తుందని, ఒప్పుకోవకపోవడంతో చంపేందుకు ప్రయత్నించిందని, రమ్య బంధువు అయిన కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డితో ఫోన్ చేయించి బెదిరించిందని, తనతో నాకు విడాకులు ఇప్పించాలని కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ వేశాడు. ఇప్పుడు ఈ గొడవ మరింత ముదిరింది.

వీరిద్దరి మధ్య గొడవ దాడులు చేసుకొనే వరకు వచ్చింది. నిన్న (ఫిబ్రవరి 18) రాత్రి గచ్చిబౌలిలోని నరేష్ ఇంటిపై కొందరు దుండగులు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఇంటి ముందు పార్క్ చేసిన నరేష్ కారుని ధ్వంసం చేశారట. దీంతో నేడు నరేష్ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశాడు. పోలీసులు సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. ఈ దాడి కచ్చితంగా తన మాజీ భార్య రమ్యరఘుపతి చేయించిందని నరేష్ ఆరోపణ చేస్తున్నాడు. మరి ఈ దాడి వెనుక ఎవరున్నారు అనేది పోలిసుల విచారణలో తెలియాలి.