Balakrishna : కర్నూల్ జిల్లాలో NBK 107 సినిమా షూట్.. బాలయ్యని చూడటానికి ఎగబడ్డ జనాలు..

ప్రస్తుతం NBK 107 సినిమా కర్నూలు జిల్లాలో షూటింగ్ జరుపుకుంటుంది. కర్నూలు జిల్లాలోని అలంపూర్, యాగంటి, కొమ్మ చెరువు ప్రాంతం, పూడిచర్ల, ఓర్వకల్లు, ఎయిర్పోర్ట్, కర్నూల్ సిటీ, పంచలింగాల....................

Balakrishna : కర్నూల్ జిల్లాలో NBK 107 సినిమా షూట్.. బాలయ్యని చూడటానికి ఎగబడ్డ జనాలు..

NBK 107 :  బాలకృష్ణ ఇటీవల ఫుల్ ఫామ్ లో ఉన్నారు. గత సంవత్సరం చివర్లో వచ్చిన అఖండ సినిమా భారీ విజయం సాధించింది. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాలయ్య బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ అంటూ టాక్ షోతో అదరగొట్టారు. ఈ షో కూడా చాలా రికార్డులు సాధించింది. ఇలా బాలయ్య బాబు సూపర్ సక్సెస్ లో ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా NBK 107 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది.

Suriya : సూరరై పొట్రుకు ఐదు జాతీయ అవార్డులు.. హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్..

ఇందులో బాలయ్య మంచి పవర్ ఫుల్ రోల్ నటిస్తున్నారని ఇప్పటికే రిలీజైన టీజర్ తో తెలిసిపోయింది. ప్రస్తుతం NBK 107 సినిమా కర్నూలు జిల్లాలో షూటింగ్ జరుపుకుంటుంది. కర్నూలు జిల్లాలోని అలంపూర్, యాగంటి, కొమ్మ చెరువు ప్రాంతం, పూడిచర్ల, ఓర్వకల్లు, ఎయిర్పోర్ట్, కర్నూల్ సిటీ, పంచలింగాల.. మరిన్ని ప్రదేశాల్లో సినిమా షూటింగ్ జరుగుతుంది. దీంతో బాలకృష్ణని చూడటానికి, ఆయనతో సెల్ఫీలు దిగటానికి జనాలు ఎగబడ్డారు. అక్కడి లోకల్ నాయకులు, టీడీపీ ప్రముఖులు కూడా వచ్చి బాలకృష్ణని కలిశారు. బాలకృష్ణ ఓపిగ్గా చాలా మంది అభిమానులతో ఫొటోలు దిగారు. అలాగే బాలయ్యబాబు షూటింగ్ కోసం వస్తున్నాడని తెలిసి అక్కడి ఫ్యాన్స్ బ్యానర్లు ఏర్పాటు చేశారు. బాలకృష్ణ కర్నూలు జిల్లాలో షూటింగ్ జరుపుకోవడంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాస్ మూవీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Balayya Babu