Bengaluru : ఐపీఎల్ చూడటం టైమ్ వేస్ట్ అంటున్న బిజినెస్ మ్యాన్.. వెరైటీగా స్పందిస్తున్న నెటిజనులు

ఐపీఎల్ చూడటం టైమ్ వేస్ట్ అంటున్నారు బెంగళూరు బిజినెస్ మ్యాన్ తనయ్ ప్రతాప్. ఆ సమయాన్ని కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటే అవకాశాలు అందిపుచ్చుకుంటామని అన్నారు. దీనిపై నెటిజన్లు నెగెటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు.

Bengaluru : ఐపీఎల్ చూడటం టైమ్ వేస్ట్ అంటున్న బిజినెస్ మ్యాన్.. వెరైటీగా స్పందిస్తున్న నెటిజనులు

Bengaluru

Bengaluru Viral News : ఐపీఎల్ సీజన్ మొదలైతే చాలు అభిమానులు వేరే పనులన్నీ పోస్ట్ పోన్ చేసుకుంటారు. నెలరోజులు మ్యాచ్‌లు చూడటమే పనిగా పెట్టుకుంటారు. దానికున్న క్రేజ్ అలాంటిది మరి. అయితే బెంగళూరుకి చెందిన తనయ్ ప్రతాప్ అనే బిజినెస్ మ్యాన్ ఐపీఎల్ చూడటం టైం వేస్ట్ అంటున్నారు. దాని బదులు కొత్త స్కిల్స్ మీద దృష్టి పెట్టడం బెటర్ అంటూ ట్వీట్ చేసారు. ఈయన ట్వీట్‌కి నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ సమయంలో వర్షం పడటానికి హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ కారణమా? వైరల్ పోస్టుకు స్పందించిన నటి

రీసెంట్‌గా ఐపీఎల్ సీజన్ ముగిసింది. దీనిపై బెంగళూరు బిజినెస్ మ్యాన్ తనయ్ ప్రతాప్ తన పేరుతో ఉన్న Tanay Pratap  ట్విట్టర్ అకౌంట్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘టైం దొరకట్లేదు అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు.. అలాంటి వారు గంటల తరబడి IPL కి అతుక్కుపోతారు. అంటే రోజులో 4 గంటలు, నెలలో 120 గంటలు వృధా.. అదే కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ టైమ్‌ని వాడితే ఎలా ఉంటుందో ఊహించండి.. మీకు దొరికిన సమయాన్ని ఎలా పెట్టుబడి పెట్టి వాడుకోవాలో ఎంచుకోండి’ అంటూ రాసుకొచ్చారు. ఈయన పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు తనయ్ ప్రతాప్ అభిప్రాయాన్ని ఏకీభవించలేదు.

IPL 2023: వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఐపీఎల్ ట్రోపీకి సీఎస్‌కే యాజమాన్యం పూజలు.. ఫొటోలు వైరల్

జీవితంలో ప్రతి గంటను నేర్చుకునేందుకు ఉపయోగించలేమని చాలామంది అభిప్రాయపడ్డారు. ‘కొంచెం ఎంటర్ టైన్‌మెంట్‌కి.. రిలాక్స్ అవ్వడానికి కేటాయించాలని.. ప్రజల్ని కొంచెం ఆనందంగా ఉండనివ్వమని’ కొందరు.. ‘ఆనందం లేని జీవితం పనిచేయడానికి ప్రేరణ ఇవ్వదని’ కొందరు అభిప్రాయపడ్డారు.


గత ఏడాది కాలంగా రోజూ స్నానం చేయడం వల్ల ఎంత సమయం వృధా చేశారో తెలుసా? అంటూ మరో నెటిజన్ వెరైటీగా స్పందించారు. రోజూ స్నానం చేయడం వల్ల సుమారుగా 182.5 గంటల సమయం ఖర్చవుతుందని లెక్కలు వేశారు. స్నానం చేసే సమయాన్ని సరిగ్గా వాడుకుంటే చాలా పనులు చేయొచ్చని చెప్పుకొచ్చారు.