Girish Bapat: బీజేపీకి బిగ్ లాస్.. పార్టీ ఎంపీ గిరిష్ బాపట్ మరణం

ఏడాదిన్నరగా గిరిష్ బాపట్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనానాథ్‌ మంగేష్కర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 72వ ఏట బుధవారం తుదిశ్వాస విడిచారు. పూణె నగరంలోని కస్బా పేట్ నియోజకవర్గం నుంచి గిరిష్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో పూణే నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు

Girish Bapat: బీజేపీకి బిగ్ లాస్.. పార్టీ ఎంపీ గిరిష్ బాపట్ మరణం

BJP Leader, Pune MP Girish Bapat Dies at Age 72

Girish Bapat: మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీకి పెద్ద లాస్ అనే చెప్పాలి. ఆ పార్టీ నేత, పూణె ఎంపీ గిరిష్ బాపట్ బుధవారం మరణించారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర బీజేపీ అధినేత చంద్రశేఖర్ బవంకులే ప్రకటించారు. కాగా, గిరిష్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. ఈ విషయమై ప్రధాని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘గిరీష్ బాపట్ నిరాడంబరమైన, కష్టపడి పనిచేసే నాయకుడు. సమాజానికి నిబద్ధతతో సేవ చేశారు. ఆయన మహారాష్ట్ర అభివృద్ధికి విస్తృతంగా పనిచేశారు. పూణే అభివృద్ధిపై ప్రత్యేకించి మక్కువ చూపారు. ఆయన మృతి బాధాకరం. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని ట్వీట్ చేశారు.

Karnataka polls: ఇవే చివరి ఎన్నికలు.. భారీ ప్రకటన చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య

గత ఏడాదిన్నరగా గిరిష్ బాపట్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనానాథ్‌ మంగేష్కర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 72వ ఏట బుధవారం తుదిశ్వాస విడిచారు. పూణె నగరంలోని కస్బా పేట్ నియోజకవర్గం నుంచి గిరిష్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో పూణే నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈయన మృతిపట్ల ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, విపక్ష నేత అజిత్ పవార్‭లు సంతాపం తెలియజేశారు.

Wayanad Bypoll: ఆ గడువు పూర్తయ్యాక మేం స్పందిస్తాం.. రాహుల్ నియోజకవర్గంలో ఉపఎన్నికపై సీఈసీ స్పందన