Bandi Sanjay Kumar: దొంగలను పట్టుకోండంటే మాకు నోటీసులిచ్చారు? కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే
తెలంగాణలో వచ్చేది రామరాజ్యం, బిజేపీ ప్రభుత్వమే. నిరుద్యోగులకు భరోసా ఇస్తున్నాం. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ హామీ ఇచ్చారు.

Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) వ్యవహారంలో దొంగలను పట్టుకోండి అని చెబితే సిట్ అధికారులు (SIT officials) మాకు నోటీసులు ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ (BJP) ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇందిరాపార్కు (Indira Park) వద్ద బండి సంజయ్ నిరుద్యోగ మహాధర్నా చేపట్టారు. మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. 30 లక్షల మంది అభ్యర్థుల జీవితం నాశనం చేశారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంత్రి కేటీఆర్ (Minister KTR) ఉసరవెల్లిలా మాట్లాడుతున్నారని, విచారణ జాప్యంతో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని సంజయ్ ఆరోపించారు.
Bandi Sanjay Kumar: బీజేపీ ప్రభుత్వం నిజంగా ఈడీని వాడుకోవాలని చూస్తే.. తెలంగాణలో వాళ్లుండరు
తెలంగాణలో వచ్చేది రామరాజ్యం, బిజేపీ ప్రభుత్వం మేనని..నిరుద్యోగులకు భరోసా ఇస్తున్నాం..అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారాన్నిసిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలకోసం ప్రిపేర్ అయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని, పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూమంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.
Bandi Sanjay Kumar : నేటితో 100 కి.మీ పూర్తి చేసుకోనున్న బండి పాదయాత్ర
రాష్ట్రంలోకుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకంగా బిజేపీ యుద్దాన్ని ప్రారంభించిందని అన్నారు. TSPSC లీకేజీ కేసులో పోరాడితే 11మంది బిజేపీ యువ మోర్చా కార్యకర్తలను జైల్లో పెట్టారని, మాకుజైళ్లు కొత్తకాదు, దేశం కోసం.. ధర్మం కోసం తెగించి కొట్లాడుతామని సంజయ్ అన్నారు.2008 డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని, కోర్ట్ ఉత్తర్వులు శిరసా వహిస్తామని అన్నారు. నేను లేని సమయంలో ఇంటికి సిట్ అధికారులు వచ్చి నోటీసులు అంటించి పోయారని,దొంగలను పట్టుకోండి అంటే మాకు నోటీసులు ఇచ్చారంటూ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.