Rahul Narwekar: ‘మహా’ స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్.. రేపు షిండే బల పరీక్ష

రాహుల్ సాల్వే, అధికార బీజేపీ-శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల తరఫున పోటీ చేశారు. ఆయనకు స్వతంత్ర ఎమ్మెల్యేలతోపాటు, మరో ఇద్దరు చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. దీంతో సులభంగా విజయం సాధించారు.

Rahul Narwekar: ‘మహా’ స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్.. రేపు షిండే బల పరీక్ష

Rahul Narwekar (1)

Rahul Narwekar: మహారాష్ట్ర కొత్త స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. ఆదివారం అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో ఆయన 164 ఓట్లతో విజయం సాధించారు. అసెంబ్లీలో మొత్తం 288 ఓట్లు (ఎమ్మెల్యేలు) ఉండగా, ఈ ఎన్నికలో గెలవాలంటే 145 ఓట్లు రావాలి. కానీ, రాహుల్ మెజారిటీ కంటే 19 ఓట్లు ఎక్కువ సాధించారు.

Modi Meeting: భీమవరంలో మోదీ సభ సజావుగా సాగుతుంది: విష్ణు వర్ధన్ రెడ్డి

రాహుల్ సాల్వే, అధికార బీజేపీ-శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల తరఫున పోటీ చేశారు. ఆయనకు స్వతంత్ర ఎమ్మెల్యేలతోపాటు, మరో ఇద్దరు చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. దీంతో సులభంగా విజయం సాధించారు. రాహుల్ ప్రత్యర్థిగా మహా వికాస్ అఘాడి (శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ) తరఫున రాజన్ సాల్వి పోటీ చేశారు. ఆయనకు ఈ ఎన్నికలో 106 ఓట్లు పోలయ్యాయి. శాసన సభలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నర్హరి జిర్వారి ఈ ఎన్నిక నిర్వహించారు. రాహుల్ అసెంబ్లీకి మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యే కావడం విశేషం. స్పీకర్ ఎన్నిక పూర్తి కావడంతో ఇప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా షిండే తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది.

Modi Meeting: మోదీ సభకు ఐదు వేల మందితో బందోబస్తు

గత గురువారం రాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. వీరు అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ విశ్వాస పరీక్ష సోమవారం జరుగుతుంది. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బల పరీక్ష ఉంటుంది. తాజా అంచనా ప్రకారం ఈ పరీక్షలో షిండే సులభంగానే గెలుపొందుతారు.