Caught On Camera: సుకేష్ జైలు గదిలో లగ్జరీ ఐటమ్స్.. జైల్లో కన్నీళ్లు పెట్టుకున్న సుకేష్.. వీడియో రిలీజ్

రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసుతోపాటు, ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ జైలులో ఉన్నాడు. ప్రస్తుతం ఈడీ, సీబీఐ ఈ కేసుల్ని విచారిస్తున్నాయి. 2021 నుంచి అతడు ఢిల్లీ పరిధిలోని జైళ్లలోనే ఉంటున్నాడు. అయితే, ఇటీవల జైలు అధికారులు అతడి గదిని తనిఖీ చేశారు.

Caught On Camera: సుకేష్ జైలు గదిలో లగ్జరీ ఐటమ్స్.. జైల్లో కన్నీళ్లు పెట్టుకున్న సుకేష్.. వీడియో రిలీజ్

Caught On Camera: మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సుకేష్ చంద్రశేఖర్ జైలులో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను జైలు అధికారులు విడుదల చేయగా, ఈ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు దీనిపై వివాదం కూడా చెలరేగుతోంది.

Gurugram: కోవిడ్ భయంతో మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని తల్లీకొడుకు.. మూడేళ్లుగా ఎలా ఉన్నారంటే

రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసుతోపాటు, ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ జైలులో ఉన్నాడు. ప్రస్తుతం ఈడీ, సీబీఐ ఈ కేసుల్ని విచారిస్తున్నాయి. 2021 నుంచి అతడు ఢిల్లీ పరిధిలోని జైళ్లలోనే ఉంటున్నాడు. ప్రస్తుతం అక్కడి మండోలి జైలులో ప్రత్యేక భద్రత మధ్య, సీసీ కెమెరా నిఘాలో, స్పెషల్ సెల్‌లో సుకేష్ ఖైదీగా ఉన్నాడు. అయితే, ఇటీవల జైలు అధికారులు అతడి గదిని తనిఖీ చేశారు. ఈ క్రమంలో అక్కడి లగేజ్, ఇతర వస్తువుల్ని అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడ అధికారులు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

Andhra Pradesh: సోము వీర్రాజుపై అసంతృప్తిలో ఏపీ బీజేపీ నేతలు.. ఢిల్లీలో కీలక నేతలతో భేటీ

లగ్జరీ బ్రాండ్లైన గూచి చెప్పులు, ఖరీదైన రెండు జతల జీన్స్ ప్యాంట్లు దొరికాయి. గూచి చెప్పుల దర రూ.1.5 లక్షలు, జీన్స్ ప్యాంట్ల ధర రూ.80,000గా ఉంటాయని అంచనా. అనుమతి లేకుండా జైలులో ఇలాంటి వస్తువులు కలిగి ఉండటానికి వీల్లేదు. అందుకే అతడి దగ్గర కనిపించిన వస్తువుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడికి హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు తన వస్తువులు తీసుకెళ్లిన తర్వాత, సుకేష్ కొద్దిసేపు అలాగే నిలబడి ఏడ్చాడు. అతడు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది.

Karnataka: ఫ్యాక్టరీల్లో రాత్రిపూట మహిళలకు పని.. వారానికి నాలుగు రోజులే డ్యూటీ.. కొత్త చట్టం తెచ్చిన కర్ణాటక

ఈ వీడియోను అక్కడి జైలు అధికారులు విడుదల చేశారు. అయితే, ఇలాంటి వీడియోల్ని అధికారికంగా విడుదల చేయడానికి వీల్లేదు. ఇలా ఖైదీలకు సంబంధించిన వీడియో విడుదల కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని జైలు ఉన్నతాధికారులు తెలిపారు.