KTR Birthday: మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రముఖులు.. ఎవరెవరు ఏమన్నారంటే..

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఏపీ నుంచి పలువురు మంత్రులు, రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు కేటీఆర్ కు సామాజిక మాద్యమాల వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

KTR Birthday: మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రముఖులు.. ఎవరెవరు ఏమన్నారంటే..

Ktr (2)

KTR Birthday: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఏపీ నుంచి పలువురు మంత్రులు, రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు కేటీఆర్ కు సామాజిక మాద్యమాల వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

మెగస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున, రామ్ చరణ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా తెలంగాణలోని మంత్రులు, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ఏపీ నుంచి పలువురు మంత్రులు కేటీఆర్ కు సామాజిక మాధ్యమాల వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాలికి తగిలిన గాయం వల్ల ప్రజాసేవకు కొంత అంతరాయం కలిగిందని తెలిసిందని, ఈ గాయం నుంచి త్వరగా కోలుకుని ప్రజాసేవలో మమేకం కావాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌కు దీర్ఘాయుష్షు, ఆనందకరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ని కోరుకుంటున్నానని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.