CM KCR : మోదీ మాట వినకుంటే తెలంగాణకు రూ.25వేల కోట్ల నష్టం..! అయినా తగ్గేదేలే-కేసీఆర్

విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోతే రాష్ట్రానికి రూ.25 వేల కోట్ల నష్టం వస్తుంది. అయినా మీటర్లు బిగించేది లేదని తేల్చి చెప్పాం. పవర్ రిఫర్మ్స్ అమలు చేయకపోతే ఇచ్చిన నిధులు వెనక్కి..

CM KCR : మోదీ మాట వినకుంటే తెలంగాణకు రూ.25వేల కోట్ల నష్టం..! అయినా తగ్గేదేలే-కేసీఆర్

Cm Kcr

CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ తగ్గేదేలే అంటున్నారు. ప్రధాని మోదీతో సమరానికి సై అంటున్నారు. ప్రధాని మోదీని, బీజేపీ నేతలను టార్గెట్ చేసిన కేసీఆర్.. మరోసారి వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. బీజేపీ మస్ట్ గో ఫ్రమ్ దిస్ కంట్రీ (బీజేపీ ఈ దేశం నుంచి వెళ్లిపోవాలంతే) అని కేసీఆర్ నినందించారు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉండడానికి వీల్లేదని అన్నారు. ఇప్పటికే బీజేపీ చేసిన పాపాలు ఎక్కువైపోయాయని, మోదీకి ఇచ్చిన సమయంలో 80 శాతం అయిపోయిందని కేసీఆర్ అన్నారు.

Realme C35 Phone : రూ.13 వేలకే రియల్‌మీ కొత్త ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరా..!

ప్రధాని మోదీ తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని.. పార్లమెంట్‌లో ఆమోదం పొందకముందే బిల్లును అమలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాల్సిందేనని ముసాయిదా బిల్లులో ప్రస్తావించారని.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శాతం అదనంగా ఎఫ్ఆర్‌బీఎం ఇస్తామంటున్నారని కేసీఆర్ అన్నారు. ఈ విషయంలో ఏపీ ఒప్పుకుందని.. తెలంగాణ ఒప్పుకోలేదని కేసీఆర్ తెలిపారు. ఏపీలో ఇప్పటికే కొన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారని.. కేంద్రం పెట్టమని చెప్పకుండానే జగన్ పెట్టారా అని కేసీఆర్ ప్రశ్నించారు. శ్రీకాకుళంలో 25వేల మోటార్లకు మీటర్లు పెట్టారని.. ఈ మేరకు టెండర్లు పిలిచారన్నారు.

ప్రధాని మోదీ చెప్పేది ఒక‌టి.. చేసేదొకటి అని సీఎం కేసీఆర్ అన్నారు. మోదీ అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని.. మిషన్ భగరీథ ప్రారంభోత్సవంలోనూ విద్యుత్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేశారన్నారు. గజ్వేల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణకు యూనిట్ విద్యుత్ రూ.1.10కే ఇస్తున్నట్లు మోదీ చెప్పారని… అలా ఎప్పుడైనా ఇచ్చారా? అని కేసీఆర్ నిలదీశారు. తన పక్కనే ఉండి అబద్ధం చెబుతున్నా మర్యాద కోసం తాను మాట్లాడలేదన్నారు. 40వేల మెగావాట్ల ప్రాజెక్టులు పూర్తయినా కేంద్ర ప్రభుత్వం కరెంట్ ఉత్పత్తి చేయనివ్వడం లేదని వివరించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి బీజేపీకి విరాళాలిచ్చే వారి నుంచి సౌర విద్యుత్ కొనిపించాలని చూస్తున్నారని మోదీపై విమర్శలు చేశారు కేసీఆర్.

ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో విద్యుత్ సంస్కరణలు అమలు చేసేది లేదు. విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోతే రాష్ట్రానికి రూ.25 వేల కోట్ల నష్టం వస్తుంది. అయినా మీటర్లు బిగించేది లేదని తేల్చి చెప్పాం. పవర్ రిఫర్మ్స్ అమలు చేయకపోతే ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రి ఒత్తిడి తెస్తున్నారు. దేశంలో 4 లక్షల మెట్రిక్ యూనిట్స్ పవర్ అందుబాటులో ఉంది. 2 లక్షల మెట్రిక్ యూనిట్స్ పవర్ ను మాత్రమే వాడుతున్నాం. దేశంలో ఇది బ్యాడ్ విద్యుత్ పాలసీ. బీజేపీ ప్రజాప్రతినిధులు అబద్ధాలు మాట్లాడుతున్నారు. నాగార్జున సాగర్ విద్యుత్ ఉత్పత్తిని బంద్ పెట్టి.. సోలార్ విద్యుత్ కొనాలని ఒత్తిడి తెస్తున్నారు. తమకు కావాల్సిన వ్యాపారులకు అప్పగించి, ఎన్నికలకు పార్టీ ఫండ్ తీసుకునేందుకు ఈ దిక్కుమాలిన చర్యలు చేపడుతున్నారు. తప్పుడు ప్రచారాలతో ఎంత కాలం వెళ్లదీస్తారు.

Sleep : అతిగా నిద్రపోతున్నారా!…అయితే జాగ్రత్త?

చైనా ప్రధాని ఆ దేశంలో చేపట్టినట్లు మీరు ఏం చేశారు? కిషన్ రెడ్డి నాకు మంచి మిత్రుడే. నేను అర్థం చేసుకోలేదని కిషన్ రెడ్డి అంటారు. కేంద్ర బడ్జెట్ లో సబ్సిడీలు, సంక్షేమానికి కోత పెట్టింది నిజం కాదా? మాకు బడ్జెట్ కరెక్ట్ గా అర్థం అయ్యింది. ఎల్‌ఐసీ, విమానాలు, బ్యాంకులు, రైళ్లు అమ్ముతున్నారు. విద్యుత్తు సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణ చేయడం, కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం లక్ష్యంగా కేంద్రం ప్రతిపాదిత బిల్లులో ఉంది. దేశంలో ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. దేశంలో నిరుద్యోగ రేటు పెరుగుతోంది. 16 లక్షల పరిశ్రమలు మూత పడ్డాయి” అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.