Karnataka Polls: ఎన్నికల రణానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్.. ఉగాదికి 130 మందితో తొలి జాబితా

తొలి జాబితాలో సిట్టింగులందరి పేర్లు ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత, ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించి ప్రస్తుతం ప్రతిపక్షనేతగా ఉన్న సిద్దరామయ్య ఎక్కడ పోటీ చేస్తారనే అంశం జాబితాలో తేలిపోనుందట. వాస్తవానికి కోలారు నుంచి పోటీ చేయనున్నట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు.

Karnataka Polls: ఎన్నికల రణానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్.. ఉగాదికి 130 మందితో తొలి జాబితా

congress first list for karnataka assembly elections will release on ugadi

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తోంది. ఈ ఉగాదిన 130 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య తెలిపారు. సుదీర్ఘ కసరత్తు సాగించిన పార్టీ ఎట్టకేలకు తొలి జాబితాను కొలిక్కి తెచ్చింది. శుక్రవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. జిల్లాలవారీగా సమీక్ష జరిపిన స్ర్కీనింగ్‌ కమిటీ 130 మంది పేర్లకు ఆమోదం తెలిపింది. పార్టీ హైకమాండ్‭కు ఈ జాబితాను అందజేసింది. తొలి జాబితాలో ఇవే పేర్లతో విడుదల చేసే అవకాశం ఉంది.

Kempegowda Airport: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో మరో‘సారీ’.. భద్రతా లోపంతో దారితప్పిన ప్రయాణికులు

అయితే రాజకీయంగా ఏమైనా మార్పులు జరిగితే జాబితాలో అభ్యర్థుల సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు నెలలుగా అభ్యర్థుల ఎంపికకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, విపక్ష నేత సిద్ధరామయ్య కసరత్తు చేశారు. తొలుత పార్టీ అధిష్టానం పలు కోణాల్లో జిల్లా వ్యాప్తంగా సమీక్షలు అత్యంత రహస్యంగా జరిపింది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైన తర్వాత మరోసారి సర్వే సాగింది. ఇలా పలు సర్వేల తర్వాత జాబితాను రాష్ట్ర కమిటీ నిర్ధారించి ఢిల్లీ పెద్దలకు పంపారు.

CM YS Jagan: ఎందుకు తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి..? ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే ..

తొలి జాబితాలో సిట్టింగులందరి పేర్లు ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత, ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించి ప్రస్తుతం ప్రతిపక్షనేతగా ఉన్న సిద్దరామయ్య ఎక్కడ పోటీ చేస్తారనే అంశం జాబితాలో తేలిపోనుందట. వాస్తవానికి కోలారు నుంచి పోటీ చేయనున్నట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే పార్టీ అధిష్టానం ఇటీవల రహస్యంగా జరిపిన సర్వేలో అక్కడ అంత సానుకూలత లేదని తేలింది. రాహుల్‌ సూచనతో ప్రస్తుతం బాగల్కోటె జిల్లా బాదామి నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధరామయ్య సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.