VH : ప్రతిపక్షాలపై మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు

గతంలో ఆర్జేడీ మద్దతు కోరిన బీజేపీ.. అందుకు లాలూ సమ్మతించకపోవడంతో ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపారని వీహెచ్ అన్నారు.

VH : ప్రతిపక్షాలపై మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు

Vh

V.Hanumantha Rao: దేశంలో ప్రతిపక్ష నేతలపై మోదీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై పలు ఆరోపణలు చేశారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ పై మోదీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని వీహెచ్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఆర్జేడీ మద్దతు కోరిన బీజేపీ.. అందుకు లాలూ సమ్మతించకపోవడంతో ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపారని వీహెచ్ అన్నారు.

Also read: Ponnala Lakshmaiah: దేశానికి నాయకత్వం వహించడానికి కేసీఆర్ కు ఉన్న అనుభవం ఎంత?: పొన్నాల

బీజేపీతో కలవనందుకే లాలూకు ఐదేళ్లు జైలు శిక్ష వేశారని వీహెచ్ అన్నారు. అయినా కూడా లాలూ బెదరలేదని.. “జైలుకైనా పోత..కానీ దేశాన్ని చీల్చాలని కుట్ర చేస్తున్న బీజేపీతో కలవనని చెప్పారు.. హాట్సాఫ్ లాలూ” అంటూ వి.హనుమంత రావు అన్నారు. బీజేపీతో అనుబందంగా ఉన్న నీరవ్ మోడీ, లలిత్ మోడీలు ప్రజా ధనాన్ని లూటీ చేసుకుని విదేశాల్లో జల్సాలు చేస్తున్నారని..వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Also read: BJP MLA: నాకు ఓటు వేయనివారిది ముస్లింల రక్తమే.. -బీజేపీ ఎమ్మెల్యే

రెంట్ కట్టలేదంటూ ప్రధాన ప్రతిపక్ష నేత సోనియా గాంధీని, ఆమె కుటుంబాన్ని.. అధికారిక నివాసం నుంచి బయటకు పంపే ప్రయత్నం చేసి.. బీజేపీ నేతలు ఆ విషయాన్ని పేపర్లలో రాయించి.. నానా హంగామా చేశారని హనుమంత రావు ఆరోపించారు. సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలిలో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పనులను చేయడం లేదని వీ హెచ్ అన్నారు. గతంలో అద్వానీ, వాజ్ పేయి ఉన్నప్పుడు బీజేపీలో ఇలా లేదన్న వీహెచ్.. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నాయకులను వేధించడం మోదీకి అలవాటుగా మారిందని అన్నారు. యూపీఏ హయాంలో అవినీతికి పాల్పడిన మంత్రులను జైలుకు పంపించామన్న వీహెచ్.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మాత్రం సొంత పార్టీలో అవినీతికి పాల్పడుతున్న వారిని కాపాడుతోందని విమర్శించారు.

Also read: Supreme Court : మరోసారి సుప్రీంకోర్టుకు చేరిన తెలుగురాష్ట్రాల ఆస్తుల విభజన