Coronavirus: మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. అరుదైన రికార్డుకు చేరువలో భారత్!

దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మునుపటి రోజు కంటే ఈరోజు కేసులు కాస్త పెరిగాయి.

Coronavirus: మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. అరుదైన రికార్డుకు చేరువలో భారత్!

omicron

Coronavirus Today: దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మునుపటి రోజు కంటే ఈరోజు కేసులు కాస్త పెరిగాయి. వరుసగా ఐదో రోజు కరోనా కేసుల సంఖ్య తక్కువగానే నమోదైనా అంతకుముందు రోజు కంటే ఎక్కువ నమోదయ్యాయి.

లేటెస్ట్‌గా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మంత్రిత్వ శాఖ ప్రకారం, గత 24 గంటల్లో 14 వేల 623 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 197మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 4 లక్షల 52 వేల 651కి చేరుకుంది

కరోనావైరస్‌తో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య లక్షా 78 వేల 98కి తగ్గింది. అదే సమయంలో, కరోనాతో చికిత్స పొంది కోలుకున్నవారి సంఖ్య 19 వేల 446కి చేరుకుంది. ఇప్పటివరకు మూడు కోట్ల 34లక్షల 78 వేల 247 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం మూడు కోట్ల 41 లక్షల 8 వేల 996 కరోనా కేసులు నమోదయ్యాయి.

భారత్ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో అరుదైన రికార్డుకు అడుగు దూరంలోనే ఉంది. దేశంలో ఇప్పటివరకు 99 కోట్ల 12 లక్షల 82 వేల 283కోట్ల వ్యాక్సిన్ డోసులను(Total Vaccination: 99,12,82,283 (41,36,142 in last 24 hrs) వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 100కోట్ల డోసుల మైలురాయి దిశగా భారత్ వేగంగా కదులుతోంది. చైనా తర్వాత 100కోట్ల వ్యాక్సిన్లు వేసిన రెండో దేశంగా భారత్‌ అరుదైన రికార్డు క్రియేట్ చేయనుంది.