Bengaluru : 2.5 టన్నుల టమాటాలున్న లారీ హైజాక్.. రైతును నెట్టేసి లారీని దారి తప్పించిన ముఠా

వరుసగా టమాటా దొంగతనాల గురించి చూస్తున్నాం. ఇక టమాటా లారీని హైజాక్ చేశారు ఓ ముఠా. రైతును లారీలోంచి నెట్టేసి లారీతో పాటు పరారయ్యారు.

Bengaluru : 2.5 టన్నుల టమాటాలున్న లారీ హైజాక్.. రైతును నెట్టేసి లారీని దారి తప్పించిన ముఠా

Bengaluru

Bengaluru : టమాటా రేట్లు పెరిగినప్పటి నుంచి టమాటాల దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఇక టమాటాలతో వెళ్తున్న లారీలను హైజాక్ చేస్తున్న ముఠాలు కూడా బయలుదేరాయి. తాజాగా 2.5 టన్నుల టమాటాలున్న ట్రక్కును అపహరించిన ముఠా గుట్టు రట్టు చేసారు పోలీసులు.

Hyderabad : కూతురి పుట్టినరోజుకి 400 కేజీల టమాటాలు పంచిన తండ్రి

చిత్రదుర్గ జిల్లా హిరియూరుకు చెందిన రైతు మల్లేష్ 2.5 టన్నుల టమాటాలు అంటే రూ.2.5 లక్షల విలువైన లోడ్‌తో లారీలో వెళ్తున్నాడు. వేలూరుకు చెందిన భాస్కర్, అతని భార్య సింధూజలు చిక్కజాల వద్ద అతని లారీని అడ్డగించారు. అతని లారీ తమ కారును ఢీకొట్టిందని పరిహారం కావాలని గొడవకు దిగారు. మల్లేష్ అందుకు నిరాకరించాడు. ఈ జంటతో పాటు ఉన్న ముఠా ఒక్కసారిగా మల్లేష్ పైకి దాడి చేసి అతనిని కిందకు నెట్టేసి లారీతో పాటు పరారయ్యారు.

Tomatoes as a gift : దుబాయ్ నుంచి కూతుర్ని 10 కేజీల టమాటాలు గిప్ట్‌గా తెమ్మన్న తల్లి

రైతు మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్ఎంసీ యార్డు పోలీసులు వాహనం తరలింపుపై నిఘా పెట్టి ముఠా గుట్టు రట్టు చేశారు. భాస్కర్, సింధుజలను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.