Covid Vaccine: భారీగా తగ్గిన కొవిడ్ వ్యాక్సిన్ ధర.. రూ.225మాత్రమే

కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ షాట్స్ అందుబాటులోకి రానుండటానికి ఒక రోజు ముందుగానే భారీగా ధర తగ్గిపోయింది. సగం కంటే తక్కువగా అంటే రూ.600 నుంచి రూ.225కి పడిపోయింది వ్యాక్సిన్ ధర.

Covid Vaccine: భారీగా తగ్గిన కొవిడ్ వ్యాక్సిన్ ధర.. రూ.225మాత్రమే

Coviesheild

Covishield: కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ షాట్స్ అందుబాటులోకి రానుండటానికి ఒక రోజు ముందుగానే భారీగా ధర తగ్గిపోయింది. సగం కంటే తక్కువగా అంటే రూ.600 నుంచి రూ.225కి పడిపోయింది వ్యాక్సిన్ ధర. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్ పూనావాలా ధర తగ్గించినట్లు స్వయంగా వెల్లడించారు.

కేంద్రంతో జరిపిన పలు చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

“కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ అయిన కొవీషీల్డ్ ను ప్రైవేట్ హాస్పిటల్స్ కు రూ.600కు బదులుగా రూ.225కే అందిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. కేంద్రం నిర్దేశించినట్లుగా 18సంవత్సరాల పై బడిన వారంతా ప్రికాషనరీ డోసుగా కొవీషీల్డ్ ను తీసుకుంటారని ఆశిస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు.

Read Also: భారత్ లో 12-18 ఏళ్ల వారికి మరో వ్యాక్సిన్

గతంలో ఉన్న రూ.600 + ట్యాక్స్ ను సవరిస్తూ.. రూ.225 + ట్యాక్స్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నాయి. కొవీషీల్డ్, కొవాగ్జిన్ ధరలు భారీగా తగ్గడంతో ప్రజల నుంచి ఆదరణ ఎక్కువగా కనిపిస్తుందనే అంచనాలు కనిపిస్తున్నాయి.