Pushpa The Rise Part – 01 : బన్నీ.. ఊరమాస్.. ఉగ్రరూపం..

ఐదు భాషల్లో ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్.. ‘దాక్కో దాక్కో మేక’..

Pushpa The Rise Part – 01 : బన్నీ.. ఊరమాస్.. ఉగ్రరూపం..

Pushpa

Updated On : August 12, 2021 / 11:43 AM IST

Pushpa The Rise Part – 01 :‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘ఆర్య -2’ తర్వాత వస్తున్న క్రేజీయెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. బన్నీ – సుకుమార్ కలయికలో మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ రికార్డులను బీట్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేశాయి.

Pushpa : ‘పుష్ప’ కోసం ఓవరాల్ ఇండియా వెయిట్ చేస్తోంది..!

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన స్టైల్ కంపోజిషన్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చెయ్యబోతున్నారు. ఆగస్టు 13న ఉదయం 11:07 గంటలకు.. ఐదు భాషల్లో ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’ విడుదల కానుంది. ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడారు. గురువారం రిలీజ్ చేసిన సాంగ్ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది.

Pushpa The Rise Part – 01 : ‘పుష్ప రాజ్’ క్రిస్మస్‌కి వస్తాండాడబ్బా..

‘పుష్ప’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు.. క్రిస్మస్ కానుకగా ‘పుష్ప’ ఐదు భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా ‘పుష్ప రాజ్’ థియేటర్లలోకి రాబోతున్నట్లు అనౌన్స్‌మెంట్ ఇచ్చారు టీం.