Dil Raju : ఆ ముగ్గురి దర్శకులతో దిల్ రాజు పాన్ ఇండియా చిత్రాలు.. టైటిల్సే ఓ రేంజ్‌లో ఉన్నాయి..

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు.. ఇంట గెలిచి రచ్చ గెలవమన్న సామెతను బాగా ఫాలో అవుతున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతూ పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అనిపించుకోడానికి ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తను ప్రొడ్యూస్ చేయబోయే మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు గురించి తెలియజేశాడు.

Dil Raju : ఆ ముగ్గురి దర్శకులతో దిల్ రాజు పాన్ ఇండియా చిత్రాలు.. టైటిల్సే ఓ రేంజ్‌లో ఉన్నాయి..

Dil Raju upcoming pan india projects

Dil Raju : టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు.. ఇంట గెలిచి రచ్చ గెలవమన్న సామెతను బాగా ఫాలో అవుతున్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టిన దిల్ రాజు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. ఇప్పుడు పక్క ఇండస్ట్రీలో కూడా తన ఉనికిని చాటేందుకు సిద్దమవుతున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతూ పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అనిపించుకోడానికి ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తను ప్రొడ్యూస్ చేయబోయే మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు గురించి తెలియజేశాడు.

Dil Raju : ఒకప్పుడు బలవంతపు పెళ్లి అన్న దిల్ రాజు ఇప్పుడు ప్రేమ పెళ్లి అంటున్నాడు..

దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం ‘వరిసు’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు తను తదుపరి ప్రాజెక్ట్ లు గురించి వెల్లడించాడు. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్, హిట్ సినిమా దర్శకుడు శైలేష్ కొలను, సీనియర్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ లతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉండబోతున్నట్లు తెలియజేశాడు. ఈ మూడు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతున్నాయి. భారీ VFX తో, భారీ స్థాయిలో లార్జర్ థన్ లైఫ్ క్యారెక్టర్స్ ని పరిచయం చేసేలా ఈ చిత్రాలు ఉండబోతున్నట్లు వెల్లడించాడు.

అలాగే సినిమా టైటిల్స్ ని కూడా అనౌన్స్ చేశాడు. ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న సినిమాలో హీరోగా ప్రభాస్ మరోసారి నటించబోతున్నాడు. ఈ సినిమాకి ‘రావణం’ అనే టైటిల్ ని ఖరారు చేశాడు. ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. ఎన్టీఆర్, కేజీఎఫ్-3 చిత్రాలు తరువాత ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. అలాగే శైలేష్ కొలనుతో తెరకెక్కించబోయే సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక సీనియర్ డైరెక్టర్ ఇంద్రగంటి కలయికలో రాబోయే సినిమాకి ‘జటాయు’ అనే టైటిల్ ని పెట్టారు. అయితే ఈ రెండు సినిమాల్లో హీరోలు ఎవరన్నది తెలియజేయలేదు. టైటిల్స్ తోనే సినిమాలు పై అంచనాలు క్రియేట్ చేసిన దిల్ రాజు ఇక సినిమాలతో ఏ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.