Nalgonda Municipality : నల్లగొండ టీఆర్ఎస్ మున్సిపాలిటీలో ముసలం..సమావేశానికి 14మంది కౌన్సిలర్ల డుమ్మా

నల్లగొండ టీఆర్ఎస్ మున్సిపాలిటీలో ముసలం పుట్టింది. మున్సిపల్ సమావేశానికి 14మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు.

Nalgonda Municipality : నల్లగొండ టీఆర్ఎస్ మున్సిపాలిటీలో ముసలం..సమావేశానికి 14మంది కౌన్సిలర్ల డుమ్మా

Disagreements In Nalgonda Trs Municipality Telangana..

Nalgonda Municipality : నల్లగొండ టీఆర్ఎస్ మున్సిపాలిటీలో ముసలం పుట్టింది. మున్సిపల్ సమావేశానికి 14మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే..మున్సిపల్ చైర్మన్ తీరుపై అసంతృప్తిగా ఉన్న కౌన్సిలర్లు ఈరోజు జరగాల్సిన మున్సిపల్ సమావేశానికి డుమ్మా కొట్టారు. సమావేశానికి రాకుండా 14మంది కలిసి నాగార్జున సాగర్ టూర్ కువెళ్లిపోయారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గానికి గుండెకాయ నల్లగొండ మునిసిపాలిటీ. ప్రస్తుతం ఈ మునిసిపాలిటీలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి 23 మంది కౌన్సిలర్లు ఉండగా ఏకంగా 14మంది కౌన్సిలర్లు సమావేశానికి రాకుండాపోయారు. వార్డుల అభివృద్ధిని పట్టించుకోవట్లేదని కొంతకాలంగా కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం (7,2022)సీక్రెట్ ఏరియాలో కౌన్సిలర్లు భేటీ అయి సమావేశానికి వెళ్లకూడాదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

కొంతకాలంగా సొంత పార్టీ చైర్మన్‌తో కౌన్సిలర్లకు పొసగడంలేదు. 15వ ఫైనాన్స్‌ నిధులు రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు వార్డులకు వస్తాయి. వాటిని మూడేళ్లుగా పట్టణ ప్రగతి పేరుతో దారిమళ్లిస్తున్నారు. ఈ నిధులను పట్టణంలో ఎక్కడ వెచ్చిస్తున్నారో కౌన్సిలర్లకు సమాచారం ఉండడం లేదనేది ప్రధాన ఆరోపణగా ఉంది.. కలెక్టర్‌ అనుమతి తీసుకుని అర్బన్‌ పార్కుల పేరుతో నిధులు ఖర్చు పెడుతున్నారు. పట్టణంలో ప్రస్తుతం వాటర్‌ ట్యాంకర్‌ పంపాలంటే రూ.500 చొప్పున మునిసిపాలిటీ వసూలు చేస్తోంది. గతంలో ఉచితంగా పంపిణీ చేయడంతో తమకు స్థానికంగా తమకు మంచిపేరు ఉండేదని..కానీ ఇప్పుడు డబ్బు వసూలుతో వార్డుల్లో ఇబ్బందికరంగా మారిందని అధికార పార్టీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్‌ అధికారులు తమకు ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని, ఈ విషయాలను చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లినా ఆయన మౌనం వహించడం తప్ప పరిష్కారం చూపడం లేదంటు వాపోతున్నారు. దీనికి నిరసనగా శనివారం (7,2022)నిర్వహించనున్న మునిసిపల్‌ జనరల్‌బాడీ సమావేశానికి దూరంగా ఉండాలని 23 మంది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లలో 14 మంది ఓ నిర్ణయానికి వచ్చి శుక్రవారమే నల్లగొండ విడిచి నాగార్జునసాగర్‌లో రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం.