Etela Rajender: హామీల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు: టీఆర్ఎస్‌పై ఈటల విమర్శలు

ఇచ్చిన హామీల గురించి అడిగితే పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో పిల్లలు తమకు కావాల్సిన హక్కులు, అవసరాల గురించి అడిగితే పోలీసులతో అణగదొక్కేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతబడి ఉండటమే అందుకు ఉదాహరణ.

Etela Rajender: హామీల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు: టీఆర్ఎస్‌పై ఈటల విమర్శలు

Etela Rajender

Etela Rajender: ఇచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తే టీఆర్ఎస్ నేతలు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. జగిత్యాల జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, కేసీఆర్‌పై ఈటల విమర్శలు చేశారు. ‘‘తెలంగాణ తొలి సీఎం దళితుడే అని ప్రకటించిన కేసీఆర్ తర్వాత మోసం చేశారు.

Sonia Gandhi: ఈడీ విచారణకు దూరంగా సోనియా గాంధీ

ఇచ్చిన హామీల గురించి అడిగితే పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో పిల్లలు తమకు కావాల్సిన హక్కులు, అవసరాల గురించి అడిగితే పోలీసులతో అణగదొక్కేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతబడి ఉండటమే అందుకు ఉదాహరణ. కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నప్పటికీ సికింద్రాబాద్ రైల్వే ఘటన ఎందుకు జరిగింది? ఈ ఘటనలో ఎందుకు ఫెయిలయ్యారు? కేసీఆర్ శవ రాజకీయాలు చేస్తుండు. దేశంలో అత్యుత్తమ స్థానమైన రాష్ట్రపతి పదవి కోసం గిరిజన మహిళను బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంపిక చేసింది.

MVA crisis: ముగిసిన మహా క్యాబినెట్ మీటింగ్.. అసెంబ్లీ రద్దుపై తేల్చని సీఎం

మోదీ మంత్రివర్గంలో దాదాపు 60 శాతం మంది దళిత, బీసీ మంత్రులు ఉన్నారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకుని, 740 గిరిజన జాతుల అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులను ఇన్‌ఛార్జులుగా నియమించారు’’ అని ఈటల వ్యాఖ్యానించారు.