Delhi Heavy Rains : ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్.. భారీ వర్షంతో నేలకూలిన చెట్లు.. విమాన సర్వీసులు రద్దు!

Delhi Heavy Rains : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం (మే 23) తెల్లవారుజాము నుంచి బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. రోడ్లు బ్లాక్ అయ్యాయి.

Delhi Heavy Rains : ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్..  భారీ వర్షంతో నేలకూలిన చెట్లు.. విమాన సర్వీసులు రద్దు!

Flights Hit Due To Heavy Rain, Storm In Delhi Ncr, Traffic Disruptions Likely

Delhi Heavy Rains : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం (మే 23) తెల్లవారుజాము నుంచి బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. రోడ్లు బ్లాక్ అయ్యాయి. విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కేంద్రం (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. పశ్చిమలో వర్ష ప్రభావంతో సోమవారం 50-60 kmph వేగంతో కుంభవృష్టితో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. నగర ప్రజలు అత్యవసరం తప్ప బయటకు రావొద్దని, అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది.

ప్రతికూల వాతావరణం కార‌ణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలో విమాన‌యాన కార్యకలాపాలపై కూడా తీవ్ర ప్ర‌భావం చూపింది. అనేక విమానయాన సంస్థల సేవ‌లు నిలిచిపోయాయి. వ‌ర్షాల కార‌ణంగా ప‌లు విమాన‌యాన సంస్థ‌లు ముందుగానే ప్ర‌యాణికుల‌కు విజ్ఞ‌ప్తి చేశాయి. ఎయిర్ పోర్టుకు వ‌చ్చే ముందు స‌ర్వీసుల‌ స్టేట‌స్ చూసుకుని బ‌య‌లుదేరాల‌ని సూచించాయి. రాబోయే కొద్దిగంటల్లో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.

ఉరుములతో కూడిన తుఫాను కారణంగా గృహాలు, పాత నిర్మాణాలు దెబ్బ‌తినే అవ‌కాశం ఉంద‌ని, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని IMD తెలిపింది. కొన్ని గంట‌ల పాటు ఢిల్లీ, NCR పరిసర ప్రాంతాలలో గంట‌కు 60-90 కిలో మీట‌ర్ల వేగంతో ఉరుములతో కూడిన వర్షం 60-90 కిలో మీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఢిల్లీలో సోమవారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 27, 37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని ఆదివారం వాతావరణ కార్యాలయం తెలిపింది.


ఢిల్లీ వర్షప్రభావిత ప్రాంతాల్లో ప్రజలెవరూ కాంక్రీట్ అంతస్తులపై పడుకోవద్దని, కాంక్రీట్ గోడలకు ఆనుకొని ఉండొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్ పరికరాలను అన్‌ప్లగ్ చేయాలని సూచిస్తున్నారు. నీటి వనరులకు సమీపంలో ఉండొద్దని, విద్యుత్తుకు సంబంధించి అన్ని వస్తువుల నుంచి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Read Also : Heavy Rains: చల్లటి కబురు.. దేశవ్యాప్తంగా వానలు