Dasara Festivities : కాత్యాయని అవతారంలో బాసర జ్ఞాన సరస్వతి-పోటెత్తిన భక్తులు

నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆరవ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు,

Dasara Festivities : కాత్యాయని అవతారంలో బాసర జ్ఞాన సరస్వతి-పోటెత్తిన భక్తులు

Basara Katyayani

Dasara Festivities in Basara :  శ్రీ శారదియ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆరవ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజామునే  ఆలయ అర్చకులు,వేద పండితులు…  వేద మంత్రోత్సరణలతో అమ్మవారికి పుష్పార్చన,కుంకుమార్చన పూజలు నిర్వహించారు… అనంతరం అమ్మవారికి రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించారు.

ఈరోజు మూల నక్షత్రం కావటం వలన రాత్రి 12 గంటలనుంచే భక్తులు క్యూలైన్లలో అమ్మ వారి దర్శనం కోసం బారులు తీరారు. అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతోంది. తెల్లవారుఝూమున ఉదయం 3 గంటల నుండి అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. క్యూలైన్లలో ఉన్న భక్తులకు, చిన్న పిల్లలకు ఆలయ అధికారులు పాలు, బిస్కెట్లు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ ఉదయం అమ్మవారికి.. సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు లు సమర్పించనున్నారు.

Basara Devotees

Basara Devotees

శ్రీ శారదీయ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర కర్ణాటక నుండి భక్తులు తరలి వచ్చారు.ముందుగా పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు చేసి అమ్మవారి సన్నిధిలో ఆలయ అర్చకులచే చిన్నారులకు అక్షర భ్యాసం పూజలు జరిపించారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలను సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వైద్య బృదం ,జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Dasara Festivities Basara

Dasara Festivities Basara