Salman Khan : సల్మాన్‌ ఖాన్ కి బెదిరింపులు.. తుపాకీ లైసెన్స్ జారీ..

ఇప్పటికే సల్మాన్ తన కారుని బుల్లెట్ ప్రూఫ్ కారుగా మార్చాడు. అలాగే సల్మాన్ కి పోలీస్ డిపార్ట్మెంట్ భద్రతని కూడా ఏర్పాటు చేసింది. తాజాగా సల్మాన్ ఖాన్ కి తుపాకీ లైసెన్స్ జారీ చేసినట్టు.............

Salman Khan : సల్మాన్‌ ఖాన్ కి బెదిరింపులు.. తుపాకీ లైసెన్స్ జారీ..

Salman Khan :  ఇటీవల పంజాబీ గాయకుడు సిద్ధూ ముసేవాలాను కొంతమంది దుండగులు కాల్చి చంపారు. ఈ పని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చేయించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇతను జైల్లోనే ఉంది ఇది చేయించాడు. అయితే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గతంలోనే సల్మాన్ ఖాన్ ని చంపుతామని బహిరంగంగానే ప్రకటించాడు. తాజాగా సింగర్ సిద్ధూని చంపిన తర్వాత కూడా సల్మాన్ ఖాన్, అతని తండ్రిని చంపుతామని బెదిరించాడు. మొదట సల్మాన్ దీన్ని లైట్ గా తీసుకున్నా, అతనికి నిజంగానే ప్రాణహాని ఉందని పోలీసులు చెప్పడంతో జాగ్రత్త పడుతున్నాడు.

Nikhil : నిఖిల్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? సెలెక్ట్ అవ్వడానికి లక్ష లంచం ఇచ్చాడట..

ఇప్పటికే సల్మాన్ తన కారుని బుల్లెట్ ప్రూఫ్ కారుగా మార్చాడు. అలాగే సల్మాన్ కి పోలీస్ డిపార్ట్మెంట్ భద్రతని కూడా ఏర్పాటు చేసింది. తాజాగా సల్మాన్ ఖాన్ కి తుపాకీ లైసెన్స్ జారీ చేసినట్టు సమాచారం. సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ కొన్ని రోజుల క్రితం తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయంలో పలుమార్లు ముంబై పోలీసులని కలిసాడు సల్మాన్. తాజాగా పోలీసు ప్రధాన కార్యాలయానికి సంబంధించిన శాఖ నుండి లైసెన్స్ పొందారని ఓ IPS అధికారి తెలిపారు. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసిన తర్వాతే సల్మాన్ కి ఆయుధ లైసెన్స్‌ని జారీ చేసినట్లు తెలిపారు.