Harish Rao : ఇచ్చేది మేము.. ఊడగొట్టేది బీజేపీ

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం ఖాయమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జోస్యం చెప్పారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజ

Harish Rao : ఇచ్చేది మేము.. ఊడగొట్టేది బీజేపీ

Harish Rao

Harish Rao : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం ఖాయమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జోస్యం చెప్పారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటమి ఖాయం అన్నారు. ఓటమి భయంతోనే దళిత ఎమ్మెల్యేలను అరేయ్ ఒరేయ్ అని మాట్లాడుతున్నారని చెప్పారు.

గెల్లు శ్రీనివాస్ అంటే పేరులోనే గెలుపు ఉందన్నారు. నిఖార్సైన ఉద్యమ బిడ్డ శ్రీనివాస్ అని పొగిడారు. 139 కేసులు నమోదైనా బెదరలేదని, ఉద్యమంలో పని చేశారని హరీశ్ రావు అన్నారు. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపామని, కానీ ఇంతవరకు స్పందన లేదని హరీశ్ రావు చెప్పారు. దళిత, మైనారిటీల వ్యతిరేక పార్టీ బీజేపీ అన్నారు.

Social Media : ఆన్‌లైన్‌ ఫ్రెండ్‌ని నమ్మి వెళితే అఘాయిత్యం చేసి.. అశ్లీల వీడియోలు తీశాడు

టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు, ఆసరా, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు అమలు చేస్తోందన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి మీ మండలంలో ఒక్క రూపాయి అయినా పెట్టి పని చేయించారా అని ప్రశ్నించారు. రేపు ఈటల రాజేందర్ గెలిచినా అదే పరిస్థితి వస్తుందన్నారు. ఉద్యోగాలు ఇచ్చే పార్టీ టీఆర్ఎస్ అయితే, ఊడగొట్టే పార్టీ బీజేపీ అని హరీశ్ రావు అన్నారు.

గెల్లు గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని హరీశ్ స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో రైతుల బతుకుల్లో వెలుగులు నిండాయని అన్నారు. సాగు నీరు వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నట్టు బీజేపీ నాయకులు నిరూపిస్తే, తాము ఓట్లు అడగమని ఆయన తేల్చి చెప్పారు.

Bhubaneswar : అందమైన అమ్మాయిలు ఫొటోలు పెడుతుంది..ఛాటింగ్ చేస్తుంది, తర్వాత…

రైతన్నల సంక్షేమం కోసం ఒక్క తెలంగాణలోనే అనేక పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. భవిష్యత్ తరాల కోసం పాటు పడుతున్న టీఆర్ఎస్ కే ఓటేయాలని మంత్రి హరీశ్ కోరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 50వేలకు పైగా మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజల నడ్డి విరిచిన బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టాలని కేంద్రం చూస్తోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీని అదుకునేందుకు నిధులు కేటాయిస్తోందన్నారు. రేపటి తరం కోసం ఆలోచిస్తున్న టీఆర్ఎస్ ను ఆశీర్వదించండి. హుజూరాబాద్‌లో గతంలో 43 వేల మెజార్టీని ఇచ్చారు.. ఈసారి 50 వేల మెజార్టీ రావాలి. దొడ్డు వడ్లు కొననంటున్నారు.. మార్కెట్లు ఎత్తివేస్తామంటున్నారు.. అలాంటి పార్టీకి ఎందుకు ఓటేయాలి? అన్ని వర్గాలకు బీజేపీ వల్ల నష్టం కలుగుతోంది. ఒక వ్యక్తికి లాభం జరగాలా.. హుజూరాబాద్‌లోని ప్రజలందరికీ లాభం జరగాలా అన్నది ప్రజలే తేల్చుకోవాలి’’ అని హరీశ్‌రావు అన్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే పోటీ నెలకొందన్న హరీశ్ రావు బరిలో కాంగ్రెస్ పార్టీ లేనే లేదన్నారు. ఎవరు గెలిస్తే హుజూరాబాద్‌లో అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారో.. వారికే ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.