Bhubaneswar : అందమైన అమ్మాయిలు ఫొటోలు పెడుతుంది..ఛాటింగ్ చేస్తుంది, తర్వాత…

రకరరకాల పేర్లతో ఛాటింగ్ చేస్తూ..ఏవో కారణాలు చెబుతూ...డబ్బులు దండుకుంటున్న ఓ యువతి భాగోతం బయటపడింది. లక్షల రూపాయలు వసూలు చేసిన ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Bhubaneswar : అందమైన అమ్మాయిలు ఫొటోలు పెడుతుంది..ఛాటింగ్ చేస్తుంది, తర్వాత…

Women

Young Woman Arrested : సోషల్ మీడియాను ఉపయోగించి…మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. అందమైన అమ్మాయిల ఫొటోలు పెడుతూ..మత్తైన విధంగా ఛాటింగ్ చేస్తూ..అందినకాడికి దోచుకుంటున్నారు. రకరరకాల పేర్లతో ఛాటింగ్ చేస్తూ..ఏవో కారణాలు చెబుతూ…డబ్బులు దండుకుంటున్న ఓ యువతి భాగోతం బయటపడింది. లక్షల రూపాయలు వసూలు చేసిన ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన భువనేశ్వర్ లో చోటు చేసుకుంది.

Read More : Bhawanipur : మమత బెనర్జీకి సొంత ఇల్లు, వాహనం లేదట..!

ఫేస్ బుక్, వాట్సాప్…ద్వారా యువకులను మోసగిస్తున్న యువతి ఆటకు చెక్ పెట్టారు పోలీసులు. డీసీసీ ఉమా శంకర్ వెల్లడించిన వివరాల ప్రకారం…నగరానికి చెందిన ప్రియాంక ప్రియదర్శిని పరిడా ఫేస్ బుక్, వాట్సాప్ లలో అందమైన యువతుల ఫొటోలు పెట్టేది. దీనిని చూసి…కొంతమంది యువకులు..ఆమెతో ఛాటింగ్ చేసేవారు. వారికి ఏమాత్రం అనుమానం రాకుండా..జాగ్రత్త పడేది. కమ్మగా..మత్తైన విధంగా ఛాటింగ్ లు చేయడంతో సులభంగానే..యువకులు ఆమె ట్రాప్ లో పడేవారు. తాను ప్రేమిస్తున్నట్లు…నమ్మించేంది.

Read More : Gold Rate : మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధరలు

తర్వాత…అసలు ప్లాన్ ను బయటపెట్టేది. చదువు కోసం ఒకసారి, తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగా లేదని డబ్బులు కావాలని చెబుతూ…తన అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేయించుకొనేది. తర్వాత..ఆ అకౌంట్ డిలీట్ చేసేది. భువనేశ్వర్ కు చెందని ఓ ఇంజినీరింగ్ విద్యార్థి వద్ద రూ. 6 లక్షలకు పైగా నగదు తీసుకుని మోసగించింది. ఆ విద్యార్థి పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో ఈమె గుట్టురట్టైంది. దర్యాప్తు చేసిన పోలీసులు ప్రియదర్శిని అదుపులోకి తీసుకున్నారు.