Yadadri Landslide : యాదాద్రిలో విరిగిపడిన కొండచరియలు, రాకపోకలు నిలిపివేత

కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వానలకు రహదారులు కొట్టుకుపోతున్నాయి. ఇదే క్రమంలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి గుట్ట ఘాట్‌రోడ్డు పై

Yadadri Landslide : యాదాద్రిలో విరిగిపడిన కొండచరియలు, రాకపోకలు నిలిపివేత

Heavy rains trigger landslide on Yadadri road: కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వానలకు రహదారులు కొట్టుకుపోతున్నాయి. ఇదే క్రమంలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి గుట్ట ఘాట్‌రోడ్డు పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. రోడ్డును బ్లాక్ చేశారు. కొండపైకి భక్తులు వెళ్లకుండా నిలిపివేశారు. కాగా, మొదటి ఘాట్‌ రోడ్డు ద్వారా భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు.

యాదాద్రి కొండపైకి వెళ్లే కొత్త ఘాట్‌ రోడ్డులో టూరిజం హోటల్‌ టర్నింగ్‌ దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొద్ది రోజులుగా గుట్టపైన నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. గుట్ట అభివృద్దిలో భాగంగా గుట్టను బ్లాస్ట్ చేసి రోడ్డును నిర్మించారు. కొండచరియలు విరిగిపడటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.