Terror Letter: పంజాబ్ లో పేలుళ్లు సృష్టిస్తామంటూ జైష్-ఎ-మహమ్మద్ లేఖ: రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్

పంజాబ్ రాష్ట్రంలో పలుచోట్లా భారీ పేలుళ్లకు పాల్పడనున్నట్లు ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ పేరుతో బెదిరింపు లేఖ రావడంతో రైల్వే పోలీసులు, పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు

Terror Letter: పంజాబ్ లో పేలుళ్లు సృష్టిస్తామంటూ జైష్-ఎ-మహమ్మద్ లేఖ: రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్

Punjab

Terror Letter: పంజాబ్ రాష్ట్రంలో పలుచోట్లా భారీ పేలుళ్లకు పాల్పడనున్నట్లు ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ పేరుతో బెదిరింపు లేఖ రావడంతో రైల్వే పోలీసులు, పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సుల్తాన్‌పూర్ లోధి రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కు పోస్ట్ ద్వారా ఈ లేఖ అందింది. దీంతో స్టేషన్ సూపరింటెండెంట్ రాజ్‌వీర్ సింగ్ వెంటనే రైల్వే పోలీసు అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అన్ని స్టేషన్లలో అలర్ట్ ప్రకటించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సహా స్థానిక హిందూ దేవాలయాలు శ్రీదేవి తలాబ్ ఆలయం, ఫగ్వారాలోని శ్రీ హనుమాన్ గర్హి మరియు పాటియాలాలోని ప్రసిద్ధ కాళీ మాత ఆలయాన్ని పేల్చివేస్తామని ఉగ్రవాదులు లేఖలో పేర్కొన్నారు.

Also read:west bengal: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన కోరుతున్న లాయర్లు.. ఎందుకంటే!

ఈ ఆలయాలతో పాటుగా మే 21న జలంధర్ రైల్వే స్టేషన్, సుల్తాన్‌పూర్ లోధి స్టేషన్, లోహియాన్ ఖాస్, ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్, ఫగ్వారా, అమృత్‌సర్, తార్న్ తరణ్‌తో సహా పంజాబ్‌లోని ఇతర రైల్వే స్టేషన్లను పేల్చివేస్తామంటూ లేఖలో రాశారు. ఉగ్రదాడులపై బెదిరింపు లేఖ రావడంతో రైల్వే పోలీసులు స్టేషన్ల వద్ద నిఘాను కట్టుదిట్టం చేశారు. ఉగ్రదాడిపై రైల్వే అధికారుల నుంచి సమాచారం అందుకున్న పంజాబ్ స్టేట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. లేఖ రాసిన వ్యక్తి ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఏరియా కమాండర్ సలీం అన్సారీగా గుర్తించారు. నోట్‌బుక్ పేపర్‌పై హిందీలో ఈ లేఖ రాసిఉంది.

Also Read:Supreme Court: రాజీవ్ హంతకుడిని ఎందుకు విడుదల చేయొద్దు: కేంద్రానికి సుప్రీం ప్రశ్న

లేఖ చివరన ఖుదా హఫీజ్, ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్, ఏరియా కమాండర్ సలీం అన్సారీ, జమ్మూ కాశ్మీర్, కరాచీ పాకిస్థాన్ అని రాసి ఉంది. ఉగ్రదాడి పై లేఖ రావడం పంజాబ్ రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. అదే సమయంలో లేఖ హిందీలో ఉండడాన్ని బట్టి..ఎవరైనా ఆగంతకులు శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ఈ లేఖ రాశారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also read:MEA Jaishankar: అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు: యూరోపియన్ యూనియన్‌కు విదేశాంగ మంత్రి చురకలు