Manish Sisodia: మనీష్ సిసోడియాకు కేంద్ర హోం శాఖ షాక్.. మరో కేసులో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు

ఫీడ్ బ్యాక్ యూనిట్ (ఎఫ్‌బీయూ)కు సంబంధించి స్నూపింగ్ కేసులో సిసోడియాను విచారించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతించింది. ఈ మేరకు సీబీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి చెందిన ఎఫ్‌బీయూ ముసుగులో సిసోడియా రాజకీయ గూఢచర్యానికి పాల్పడ్డారని సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది.

Manish Sisodia: మనీష్ సిసోడియాకు కేంద్ర హోం శాఖ షాక్.. మరో కేసులో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు

Manish Sisodia: ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో అనేక ఆరోపణలు, విచారణ ఎదుర్కొంటున్నఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్రం మరో షాకిచ్చింది. ఫీడ్ బ్యాక్ యూనిట్ (ఎఫ్‌బీయూ)కు సంబంధించి స్నూపింగ్ కేసులో సిసోడియాను విచారించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతించింది.

Wipro: ఫ్రెషర్లకు సగం జీతాలు కట్ చేసిన విప్రో.. అన్యాయమంటున్న ఐటీ ఉద్యోగుల సంఘం

ఈ మేరకు సీబీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి చెందిన ఎఫ్‌బీయూ ముసుగులో సిసోడియా రాజకీయ గూఢచర్యానికి పాల్పడ్డారని సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపేందుకు అనుమతివ్వాలని సీబీఐ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కోరింది. దీంతో ఆయన భారత రాష్ట్రపతికి, కేంద్రానికి లేఖ రాశారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనికి స్పందించిన కేంద్ర హోం శాఖ సిసోడియాను ఈ కేసులో విచారించేందుకు అనుమతించింది.

ANDHRA PRADESH: ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

దీంతో ఎఫ్‌బీయూ స్నూపింగ్ కేసులోనూ సిసోడియా సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయన లిక్కర్ స్కాంలో కూడా సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం వచ్చే ఆదివారం ఆయన సీబీఐ ముందు హాజరు కావాల్సి ఉంది.

ఏంటీ ఎఫ్‌బీయూ
కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో ఎఫ్‌బీయూ ఏర్పాటు చేసింది. దీని కోసం రూ.1 కోటి నిధులు కేటాయించింది. ప్రభుత్వ అధికారులు, సంస్థలు ఎలా పని చేస్తున్నాయో నిఘా వేసి, సంబంధిత సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం ఈ సంస్థ చేయాల్సిన పని. దీని ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగవుతుందని ఆప్ తెలిపింది. అయితే, ఎఫ్‌బీయూను ఆప్ తమ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ నేతలపై నిఘా పెట్టేందుకు వాడుకుందని సీబీఐ ఆరోపణ. అంతేకాదు.. దీని కోసం కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయని కూడా మరో ఆరోపణ. వీటన్నింటిపై సీబీఐ విచారణ చేపట్టనుంది.