MiG-21 fighter: మూడేళ్లలో మిగ్ విమానాలకు వీడ్కోలు

మిగ్ యుద్ధ విమానాలకు భారత సైన్యం త్వరలో వీడ్కోలు పలకనుంది. 2025కల్లా సైన్యంలోంచి ఈ విమానాలను పూర్తిగా తొలగించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయించింది. ప్రస్తుతం మన సైన్యం దగ్గర నాలుగు స్క్వాడ్రన్ల మిగ్ విమానాలున్నాయి.

MiG-21 fighter: మూడేళ్లలో మిగ్ విమానాలకు వీడ్కోలు

Mig 21 Fighter

MiG-21 fighter: మిగ్ యుద్ధ విమానాల్ని 2025కల్లా సైన్యం నుంచి తప్పించాలని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) భావిస్తోంది. త్వరలో ఈ విమానాలకు సైన్యం వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. గురువారం సాయంత్రం మిగ్-21 విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగ్ విమానాల సామర్ధ్యంపై మరోసారి చర్చ మొదలైంది.

Mass Hysteria: అరుపులు.. ఏడుపులు.. స్కూల్లో విచిత్రంగా ప్రవర్తించిన అమ్మాయిలు… అసలేమైంది?

ఇప్పటికే మిగ్ యుద్ధ విమానాలు అనేకసార్లు కూలిపోయాయి. గడిచిన 20 నెలల్లోనే 6 మిగ్ విమానాలు కూలిపోయాయి. గత 60 ఏళ్లలో దాదాపు 400 మిగ్ విమానాలు కూలిపోయాయి. 200 మందికి పైగా పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. 1964లో మిగ్-12 యుద్ధ విమానం మొదటిసారి సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్‌గా భారత వైమానిక దళంలోకి చేరింది. అప్పట్లో ఈ విమానాలను రష్యాలో తయారు చేసేవారు. వీటిని అసెంబుల్ చేసే హక్కులతో పాటు సాంకేతికను కూడా భారత్.. రష్యా నుంచి పొందింది. ఆ తర్వాత 1967లో ఈ విమానాల తయారీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్ పొందింది. అనంతరం దేశంలోనే విమానాల తయారీ ప్రారంభించింది.

Monkeypox: మంకీపాక్సా.. స్కిన్ అలర్జీనా? తేడా తెలుసుకోండి

ఈ విమానాల తయారీని రష్యా 1985లోనే నిలిపివేసినప్పటికీ, భారత వాయుసేన మాత్రం దాని అప్‌గ్రేడ్ వేరియంట్‌ను ఉపయోగిస్తూనే ఉంది. పాకిస్తాన్‌తో 1971లో జరిగిన యుద్ధంతోపాటు 1999 కార్గిల్ యుద్ధ సమయంలో కూడా మిగ్ విమానాలు కీలక పాత్ర పోషించాయి. అయితే ప్రస్తుతం ఈ విమానాలకు వీడ్కోలు పలకాలని సైన్యం భావిస్తోంది. ప్రస్తుతం ఇండియా దగ్గర నాలుగు స్క్వాడ్రాన్ల‌ మిగ్ విమానాలున్నాయి. ఒక్కో స్క్వాడ్రన్‌లో 16-18 మిగ్ విమానాలుంటాయి. వీటిలో ఒక స్కాడ్రన్‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌లో వీడ్కోలు పలుకుతారు. మిగతా మూడింటిని 2025 లోపు తొలగిస్తారు. అయితే, విమానాలను సైన్యం నుంచి తొలగించాలనే నిర్ణయానికి, గురువారం జరిగిన ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని సైన్యం ప్రకటించింది.

BGMI Banned: మరో మొబైల్ గేమ్‌పై కేంద్రం నిషేధం

మిగ్ విమానాల స్థానంలో మరింత అధునాతన విమానాల్ని ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగానే వాటిని తొలగిస్తున్నామని సైన్యం చెప్పింది. ఇప్పటికే భారత్ దగ్గర సుఖోయ్‌తోపాటు రాఫెల్ వంటి యుద్ధ విమానాలు ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే మరిన్ని రాఫెల్ యుద్ధ విమానాలు సైన్యంలో చేరుతాయి.