Hibiscus : మందార మొక్క ఔషధగుణాలు తెలిస్తే?

మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందారం టీ ఉపయోగపడుతుంది.

Hibiscus : మందార మొక్క ఔషధగుణాలు తెలిస్తే?

Hibicus

Hibiscus : ఔషధగుణాలు కలిగిన మొక్కల్లో మందార కూడా ఒకటి. ఆరోగ్యానికి ఈ చెట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. ఈ మొక్క యొక్క వివిధ భాగాలు ఔషదాల తయారీకి వినియోగిస్తారు. వీటితో జాములు, సూపులు, సాస్లను తయారు చేస్తారు. మందారం చెట్టు పువ్వులను ఈజిప్ట్ తదితర ప్రాంతాలలో కర్కాడే అనే పానీయం తయారు చేస్తారు. మందారంలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కడుపు క్యాన్సర్, లుకేమియా వంటి కొన్ని రకాల క్యాన్సర్లను దరిచేరకుండా కాపాడుతుంది.

మందార ఆకులతో తయారు చేసిన టీలో విటమిన్ సి అధికంగా లబిస్తుంది. బరువు తగ్గడానికి మందారం టీ అద్భుతంగా పనిచేస్తుంది.. సాధారణంగా మనం తయారుచేసుకునే టీ లో కొన్ని మందారం ఆకులు వేసుకుని బాగా మరిగించి వడపోసి ఆ టీని తాగడం వలన బరువు తగ్గుతారు. ఈ టీ సహజంగా ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. మందారం టీ విటమిన్ సి, ఖనిజాలు అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మందారం టీ ప్రేగు కదలికలను క్రమబద్దీకరణకు సహాయపడుతుంది. హైపర్ టెన్షన్ కు ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది. మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి.

మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందారం టీ ఉపయోగపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. మందార ఆకు టీ త్రాగటం వలన మీ శరీరంలో అనవసరమైన కొవ్వు తగ్గుతుంది. అంతేకాక ఆహార జీర్ణక్రియకు మరింత సమర్ధవంతంగా సహాయపడుతుంది. మందారం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. పూర్వం నుంచి జుట్టు పెరుగుదలకు మందారం ను ఉపయోగిస్తున్నారు. ఆకులు, పువ్వుల తో తలపై మర్దన చేసుకుంటే ఒత్తిడి వల్ల వచ్చే తల నొప్పి తగ్గుతుంది.

మందారం జుట్టు సంరక్షణ లో కీలక పాత్ర పోషిస్తుంది. మందారం పూలను కొబ్బరి నూనె లో వేసి మరిగించి, చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఈ నూనె రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలకుండా ఉండేందుకు , చుండ్రు సమస్యకు చక్కటి పరిష్కారం ఈ నూనె ఉపయోగపడుతుంది. మందార పువ్వుల్ని నీడలో ఆరబెట్టి పొడి చేసుకుని కషాయంలా తీసుకుంటే నెలసరి సమయంలో ఏర్పడే పొత్తికడుపు నొప్పి, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.