Covid Children Health : పిల్లల మానసిక ఆరోగ్యంపై కోవిడ్ ప్రభావం.. తల్లిదండ్రులు వారికి ఎలా సహాయపడగలరు

Covid Children Health : పిల్లల మానసిక ఆరోగ్యంపై కోవిడ్ ప్రభావం.. తల్లిదండ్రులు వారికి ఎలా సహాయపడగలరు

Covid Children Health

Covid Children Health : కరోనా వైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ ఏడాదిన్నర కావొస్తున్నా ఇంకా వేధిస్తూనే ఉంది. లక్షల మంది ప్రాణాలు బలితీసుకున్న ఈ మహమ్మారి కొత్త కొత్త రూపాల్లో విరుచుకుపడుతూనే ఉంది. కరోనా కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నామన్న ఆనందమే లేకుండా పోతోంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కొత్త రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్ కారణంగా పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరి పిల్లల మానసిక ఆరోగ్యంపై మహమ్మారి ప్రభావం చూపకుండా తల్లిదండ్రులు ఏ విధంగా సాయపడగలరు? ఈ సమస్యకు పరిష్కారం ఉందా? నిపుణులు ఏమంటున్నారు?

మహమ్మారి కారణంగా పిల్లలలో ఆందోళన, ఒత్తిడి, ప్రవర్తనా సమస్యలు, మానసిక స్థితి, హైపర్యాక్టివిటీ వంటి మానసిక ఆరోగ్య సమస్యల పెరుగుదలను వైద్యులు నివేదిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉండే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మానసిక సమస్యలతో బాధపడే పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఎక్కువమంది పిల్లలు నిరాశ, ఆందోళన, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పిటిఎస్డి) సంకేతాలను చూపిస్తున్నారని డాక్టర్లు చెప్పారు.

కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ కొత్త సమస్యలు దారితీసింది. పిల్లల్లో శారీరక శ్రమ లోపించింది. ఇంట్లోనే ఉండి ఉండి సమస్యలు వచ్చాయి. వివిధ వయసుల పిల్లలు వివిధ ఆరోగ్య సమస్యలతో వస్తున్నారు. చాలా చిన్న పిల్లలు బయట అడుగు పెట్టలేదు. కొంతమంది పిల్లలు
అపరిచితుల ఆందోళనను ఎదుర్కొంటున్నారు, అంటే వారు అపరిచితులని చూసి భయపడుతున్నారు. పిల్లలు తల్లిదండ్రులను తప్ప మరెవరినీ కలవలేరు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల మలబద్దకం, ఊబకాయానికి దారితీస్తోంది. పెద్ద పిల్లలు కెరీర్ గురించి ఆందోళన చెందుతున్నారని డాక్టర్లు చెప్పారు.

ఆరోగ్యం అనేది శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు. శారీరక ఆరోగ్యం గురించి మాట్లాడితే, పిల్లలకు వ్యాయామం లేదు. సామాజిక విషయానికి వస్తే, పిల్లలు బయటకు వెళ్ళడం లేదు. మూడవ విషయం మానసిక ఆరోగ్యం. చాలామంది తల్లిదండ్రులు.. ఇంట్లో ఉన్నంత సేపు చదువుకోవాలని పిల్లలపై ఒత్తిడి చేస్తున్నారు. కరోనా భయం కారణంగా వారిని బయటకు పంపడం లేదు. అసలు పిల్లల మనసులో ఏముందో తెలుసుకోవడం లేదు. అలా చేయడం వల్ల సమస్యలు వస్తున్నాయి. కేవలం చదువుకే పరిమితం చేయకూడదు. గేమ్స్, వ్యాయమం వంటివి కూడా చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు.

భయం అనేది పిల్లల్లో సాధారణం. పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడాలి. వారి ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలి. వారి భయాలు తొలగించాలి. జరుగుతున్న దాని గురించి వివరించాలి. వారిలో ధైర్యాన్ని, భరోసాను నింపాలి అని నిపుణులు చెప్పారు.

చాలా మంది పిల్లలు ఎక్కువగా మాట్లాడరు. ముఖ్యంగా చిన్న పిల్లలు తమ తాత, అవ్వలతో ఎక్కువగా అటాచ్ మెంట్ ఉంటుంది. వారిని కోల్పోవడం వారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఎంతగా అంటే, కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే, అతను / ఆమె చనిపోతుందని వారు అనుకుంటారు. దీని ద్వారా పిల్లలు నావిగేట్ చెయ్యడానికి, వారితో మాట్లాడండి. విషయాలను వివరించండి. అతను / ఆమె ఎందుకు చనిపోయాడో వారు తెలుసుకోవాలి. వారు బయటకు వెళ్లారని, తిరిగి వస్తారని చెప్పడానికి ఎప్పుడూ ప్రయత్నించకండని నిపుణులు స్పష్టం చేశారు. ఇలా.. తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్పారు.