India Covid-19 Update : దేశంలో కొత్తగా 2,71,202 కోవిడ్ కేసులు నమోదు

దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరగుతోంది. నిన్న కొత్తగా 2,71, 202 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే 2,369 కేసులు నిన్న ఎక్కువగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ విడ

India Covid-19 Update : దేశంలో కొత్తగా 2,71,202 కోవిడ్ కేసులు నమోదు

National Covid Up Date

India Covid-19 Update :  దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరగుతోంది. నిన్న కొత్తగా 2,71, 202 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో  పోలిస్తే 2,369 కేసులు నిన్న ఎక్కువగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలపింది. నిన్న కోవిడ్ వల్ల 314 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,86,066కి చేరింది.

నిన్న 1,38, 331 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లారు. ప్రస్తుతం దేశంలో 15,50,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 16.28 శాతం గా ఉంది. ఇక ఒమిక్రాన్ కేసులు చూస్తే 7,743 కేసులు నిన్న నమోదయ్యాయి. దేశరాజధాని ఢిల్లాలో నిన్న 20,718 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.ఈ సంఖ్య మునుపటి రోజు కంటే 4వేలు తక్కువ.

మరో వైపు ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 22 వరకు ర్యాలీలు, రోడు షో లపై నిషేధం విధించింది. కాగా ఇండోర్ లో జరుపుకునే సమావేశాల్లో గరిష్టంగా 300 మంది లేదా…. ఆ హాల్ సామర్ధ్యంలో 50 శాతం ఆక్యుపెన్సీతో సమావేశాలు నిర్వహించుకోవచ్చని పేర్కోంది.
Also Read : TS Cabinet : తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ ? రేపు జరిగే క్యాబినెట్ భేటీలో చర్చించనున్న సీఎం కేసీఆర్
ముంబై లోనూ శనివారం కోవిడ్ కేసుల సంఖ్య తగ్గింది. శుక్రవారం 11,317 నమోదు కాగా….శనివారం 10,661 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో శనివారం 32,793 కోవిడ్ కేసులు నమోదు కాగా వీటిలో 22,284కేసులు బెంగుళూరులోనే ఉన్నాయి.