RRR: ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. ఎలా చూసినా కుదిరేలా లేదుగా!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దాదాపు మూడేళ్లుగా....

RRR: ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. ఎలా చూసినా కుదిరేలా లేదుగా!

Is Rrr Sequel Impossible

RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా ప్రేక్షకులను ఊరిస్తూ వచ్చింది. బాహుబలి సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం.. టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు.

RRR: ఎన్టీఆర్-చరణ్ డామినేషన్ వార్.. నోళ్లు మూయించిన ఆన్సర్!

కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లతో తన సత్తా చాటగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో కొత్త చర్చ సాగుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి హింట్ ఇచ్చారు. తారక్, రాజమౌళికి తన ఆలోచనను చెప్పగా వారికి అది నచ్చిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే సినీ ఎక్స్‌పర్ట్స్ మాత్రం ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఏ విధంగా చూసినా కుదిరే పని కాదని తేల్చి చెబుతున్నారు.

RRR: అన్‌స్టాపబుల్ కలెక్షన్లు.. ఇండియన్ సినిమా అడ్రెస్ మార్చేస్తున్న ఆర్ఆర్ఆర్!

గతంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమాలో ‘‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..?’’ అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సెకండ్ పార్ట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసేలా చేశాడు జక్కన్న. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రం విషయంలో అలాంటి పాయింట్ ఏమీ లేదు. ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చినా, సీక్వెల్‌కు కావాల్సిన పాయింట్ మాత్రం ఆర్ఆర్ఆర్‌లో మిస్ అయ్యిందని సినీ విమర్శకులు అంటున్నారు. అంతేగాక చరణ్, తారక్ తదుపరి ప్రాజెక్టులు చూస్తే వారు ఇప్పట్లో ఖాళీ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం అవుతుంది. అటు రాజమౌళి కూడా తన నెక్ట్స్ మూవీని మహేష్ బాబుతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా పూర్తి కావాలంటే మరో రెండేళ్ల సమయం పడుతుంది. ఆ తరువాత అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.

RRR: ఆర్ఆర్ఆర్‌లో పవన్ కళ్యాణ్.. నిజం!

ఈ లెక్కన వీరు ముగ్గురు తమ ప్రాజెక్టులను పూర్తి చేసినా, ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ రావాలంటే బలమైన పాయింట్ కావాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలాంటి పాయింట్ లేకపోవడంతో ఈ సినిమాను చూసిన ఆడియెన్స్ థియేటర్ల నుండి ఏదో వెలితితో బయటకు వచ్చారనేది వాస్తవం. మరి నిజంగానే ఆర్ఆర్ఆర్ సీక్వెల్ అనేది కేవలం మాటలకే పరిమితం అవుతుందా.. లేక జక్కన్న అండ్ టీమ్ ఈ సినిమాను ఎప్పటికైనా పట్టాలెక్కించే అవకాశం ఉందా.. అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఏదేమైనా.. ఎలా చూసినా కూడా RRR సీక్వెల్ మాత్రం కుదిరేలా లేదని సినీ ఎక్స్‌పర్ట్స్ తేల్చేయడంతో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.