Jagga Reddy: చిరంజీవి, రజినీకాంత్ ఫెయిల్.. రేవంత్‌ హీరోయిజం పనికిరాదు-జగ్గారెడ్డి

నాకు కూడా అభిమానులు ఉన్నారు. కావాలంటే పార్టీ సపోర్ట్ లేకుండా 2లక్షల మందితో సభ పెట్టి చూపిస్తాను.

Jagga Reddy: చిరంజీవి, రజినీకాంత్ ఫెయిల్.. రేవంత్‌ హీరోయిజం పనికిరాదు-జగ్గారెడ్డి

Jaggarddy Revanth Reddy

ఎథిక్స్ కోసమే పార్టీలో ఉన్నా
పార్టీ మారాలంటే అడ్డెవరు
రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదు
అవసరమైతే 2లక్షల మందితో సభ పెట్టగలను
చిట్ చాట్ లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కామెంట్స్

Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి వాయిస్ పెంచారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై బహిరంగంగానే మాటల తూటాలు పేల్చుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై మీడియాతో చిట్ చాట్ చేసిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి… తన మనసులోని ఆక్రోశాన్ని వ్యక్తంచేశారు.

Revanth Reddy : జగ్గారెడ్డి ఫైర్.. రేవంత్ రెడ్డి సైలెంట్

“ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కు ఉన్న ఒక్క ఎమ్మెల్యే నేనే. నాకు గజ్వేల్ సభలో మాట్లాడడానికి అవకాశం ఎందుకు ఇవ్వలేదు. ఎవరో ఒత్తిడి చేశారు కాబట్టే గీతారెడ్డి నాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందో అర్థం కావడంలేదు. ఒకరి నెత్తిన ఒకరు చెయ్యి పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? పార్టీలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా మా మీద విష ప్రచారం చేస్తున్నారు. పార్టీ మారాలంటే నాకు అడ్డు ఎవరు?” అని అన్నారు జగ్గారెడ్డి.

సిద్ధాంతాల కోసమే పార్టీలో ఉన్నా- జగ్గారెడ్డి
“ఎథిక్స్ కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ నాయకత్వం లో పని చేస్తున్నాను. పార్టీలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలను కూడా గౌరవించడం లేదు. రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదు.. చిరంజీవి, రజనీకాంత్ కనుమరుగు అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే గ్రామ స్థాయిలోకి వెళ్లి పని చేయాలి. ఈ రాష్ట్రంలో నాకు కూడా అభిమానులు ఉన్నారు. కావాలంటే పార్టీ సపోర్ట్ లేకుండా 2లక్షల మందితో సభ పెట్టి చూపిస్తాను. తప్పని పరిస్థితిలోనే మీడియా ముందు నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా” అని జగ్గారెడ్డి చిట్ చాట్ లో మాట్లాడారు.

Telangana : అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం.. సోమవారానికి వాయిదా