Bimbisara: డిసెంబర్‌లోనే ‘బింబిసార’.. షూటింగ్ ఎప్పుడు చేశారు సామి!

నందమూరి హీరోలలో కళ్యాణ్ రామ్ స్టైల్ వేరని చెప్పుకుంటారు. దాదాపుగా సొంత బ్యానర్ లోనే సినిమాలు చేసే కళ్యాణ్ రామ్ ఆ మధ్య బింబిసార అనే టైటిల్ తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Bimbisara: డిసెంబర్‌లోనే ‘బింబిసార’.. షూటింగ్ ఎప్పుడు చేశారు సామి!

Bimbisara

Bimbisara: నందమూరి హీరోలలో కళ్యాణ్ రామ్ స్టైల్ వేరని చెప్పుకుంటారు. దాదాపుగా సొంత బ్యానర్ లోనే సినిమాలు చేసే కళ్యాణ్ రామ్ ఆ మధ్య బింబిసార అనే టైటిల్ తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన గెటప్‌తో పాటు సినిమా టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో అప్పుడు అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ.. ఆ తర్వాత ఆ సినిమా ఏమైందో ఏమో.. ఎక్కడా ఎలాంటి చడీచప్పుడూ లేదు. దీంతో ఇంకా ఇది పట్టాలెక్కలేదులే అనుకున్నారు.

Shyam Singha Roy: పాపం నానీ.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి!

కానీ, ఇప్పుడు ఈ సినిమా ఏకంగా రిలీజ్ కి రెడీ అవుతుందనే వార్త రావడంతో ఒక్కసారిగా సినీ వర్గాల్లో చర్చగా మారింది. డిసెంబర్ లోనే బింబిసార విడుదలకి సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలయ్య సినిమా ‘అఖండ’ డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. దీంతో అఖండ థియేటర్లలోనే బింబిసార రిలీజ్ డేట్ తో కూడిన ట్రైలర్స్ ను వదలాలనేది ప్లాన్ గా చెప్తున్నారు. అయితే.. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగిందన్నది ఆశ్చర్యకరంగా మారింది.

Shravya Reddy: హాట్ యాంకర్ శ్రావ్య.. పోజులు చూసినా కిక్కే!

బింబిసార అనగానే ఇది చారిత్రక కథతో తెరకెక్కే సినిమాగా అనుకున్నారు. కానీ.. ఇది పూర్తి చారిత్రక చిత్రం కాదని, సోషియో ఫాంటసీ సినిమాగా తెలుస్తోంది. ఈ కథ టైమ్ ట్రావెల్ చుట్టూ నడుస్తుందని.. హీరో టైమ్ మిషన్ లో బింబిసార కాలానికి చేరుకుంటాడని చెప్తున్నారు. బింబిసార కాలంలో జరిగే సంఘటనలు ఆసక్తిని రేకెత్తిస్తాయని చెప్తున్నారు. శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా సంయుక్త మీనన్ నటిస్తుంది. అయితే, డిసెంబర్ లో విడుదల అన్నది నిజమా కదా అన్నది చూడాల్సి ఉంది.