Bollywood : కంగనా వర్సెస్ తాప్సీ.. బాలీవుడ్‌లో అంతర్యుద్ధం..

బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ సినిమాల్లో ప్రయోగాలు చేయడంలో దిట్ట. ఇటు స్టార్స్ తో రొమాన్స్ చేస్తూనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ లో లీడ్ క్యారెక్టర్స్ చేసి మెప్పిస్తుంది. రెండు దశాబ్ధాల కెరీర్ లో కంగనా

Bollywood : కంగనా వర్సెస్ తాప్సీ.. బాలీవుడ్‌లో అంతర్యుద్ధం..

Kangana Ranaut

Bollywood :  బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ సినిమాల్లో ప్రయోగాలు చేయడంలో దిట్ట. ఇటు స్టార్స్ తో రొమాన్స్ చేస్తూనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ లో లీడ్ క్యారెక్టర్స్ చేసి మెప్పిస్తుంది. రెండు దశాబ్ధాల కెరీర్ లో కంగనా ఎన్నో చాలెంజింగ్ రోల్స్ చేసి అనతి కాలంలోనే బాలీవుడ్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ అంటే గ్లామర్ షో, నాలుగు పాటలకు స్టెప్పులేయాలి, నాలుగు సీన్లలో నటించాలి అనేది బ్రేక్ చేసి ఉమెన్ సెంట్రిక్ మూవీస్, బయోపిక్స్, చాలెంజింగ్ రోల్స్ చేస్తూ సినిమా బరువంతా మోసే గట్స్ ఉన్న హీరోయిన్ గా బాలీవుడ్ లో సక్సెస్ అయిన తారల్లో కంగనా రనౌత్ పేరే ఫస్ట్ వినిపిస్తుంది.

ఇప్పుడు కంగనాకు పోటీగా మరో హీరోయిన్ తాప్సీ పేరు వినిపిస్తుంది. ఒకప్పుడు పక్కా కమర్షియల్ రోల్స్, గ్లామర్ రోల్స్ చేసిన తాప్సీ ఇప్పుడు కంగనాకు పోటీగా లేడీ ఓరియెంటెడ్, బయోపిక్ లు చేస్తుంది. కంగనాకు, తాప్సీ ఆలోచనల్లో కూడా పూర్తి వ్యతిరేకం. కంగనా సపోర్ట్ చేసే వాటిని తాప్సీ చాలా సార్లు వ్యతిరేకించింది. తాప్సీ సపోర్ట్ చేసే వాటిని కూడా కంగనా వ్యతిరేకించింది.

Balakrishna : అబ్బాయి డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చిన బాబాయ్?

కంగనా రనౌత్ ఇప్పటికే తమిళ నాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత పాత్రలో ఒదిగి పోయి తమిళ్, హిందీ భాషల్లో తలైవి చేసి మెప్పించింది. ఈ బాలీవుడ్ క్వీన్ లేటెస్ట్ గా మరో ఛాలెంజింగ్ రోల్ చేసి సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఎమర్జెన్సీ సినిమాతో ఇందిరా గాంధీ పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్ లో కంగనా ఇందిరాని అచ్చు దింపేసినట్టు ఉంది. గతంలో కంగనా లీడ్ క్యారెక్టర్ లో నటించిన క్వీన్ బాక్సాఫీస్ రికార్డ్ లను తిరగరాసింది. మణికర్ణిక సినిమాలో ఝాన్సీరాణి లక్ష్మీభాయ్ గా నటించి మెప్పించింది. ఇలా కంగనా రెండు దశాబ్ధాల కెరీర్ లో చాలా స్పెషల్ సినిమాలు చేసి అందరి హీరోయిన్స్ లా కాదు అని అనిపించుకుంది.

ఇక కంగనా రనౌత్ తర్వాత బాలీవుడ్ లో అలాంటి క్యారెక్టర్స్ చేస్తూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటుంది తాప్సీ పన్ను. రీసెంట్ గా తెలుగులో రిలీజ్ అయిన మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో ఓ చాలెంజింగ్ క్యారెక్టర్ లో కనిపించింది. రష్మీ రాకెట్ సినిమాలో గుజరాతి అథ్లెటిక్ యువతి పాత్రలో, సాండ్ కే ఆంఖ్ సినిమాలో, మిషన్ మంగళ్ సైంటిఫిక్ థ్రిల్లర్ లో.. ఇలా పలు సినిమాల్లో ఉమెన్ సెంట్రిక్ క్యారెక్టర్స్ చేసి మెప్పించింది. లేటెస్ట్ గా శభాష్ మిథు సినిమాలో మాజీ ఇండియన్ ఫిమేల్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ క్యారెక్టర్ లో నటించింది. ఈ సినిమా తాజాగా రిలీజయింది. క్రికెట్ గేమ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే శభాష్ మిథు సినిమాను సవాలుగా తీసుకుంది తాప్సీ. క్రికెట్ ఎలా ఆడాలో తెలియని తాప్సీ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా నేర్చుకుని మిథాలి రాజ్ క్యారెక్టర్ చేసింది. ఇలా కంగనాకు పోటీగా ఇటు సినిమాల్లోనూ, అటు మాటల్లోనూ ఉంటుంది తాప్సీ. డైరెక్ట్ గా పోటీ పడకపోయినా వీళ్లిద్దరి మధ్య ఉన్న పోటీ వాతావరణం బాలీవుడ్ అందరికి తెలుసు. మరి ఈ పోటీ ఎప్పుడు ఆగుతుందో చూడాలి.