Revanth Reddy : తీవ్రవాదులను కూడా ఈ రకంగా అడ్డుకోరు, ప్రజల సంపద దోచుకున్నారు- సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy : తెలంగాణ ప్రజల సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంది. తెలంగాణ దోపిడీ వెనుక కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ వెనుక కేసీఆర్ ఉన్నారు.

Revanth Reddy : తీవ్రవాదులను కూడా ఈ రకంగా అడ్డుకోరు, ప్రజల సంపద దోచుకున్నారు- సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy

Revanth Reddy : తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి. నూతన సచివాలయానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సచివాలయానికి కిలోమీటర్ ముందే తనను ఆపేశారని.. తీవ్రవాదులను, నక్సల్స్‌ను కూడా ఈ రకంగా అడ్డుకోరని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి.

తానొక ఎంపీని అని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అని, 20 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నానని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. తనని సచివాలయానికి వెళ్లకుండా అడ్డుకోవడం దారుణం అన్నారు. ”20ఏళ్లుగా నేను సచివాలయానికి వెళ్లకుండా నిర్బంధించలేదు. ఈ రోజు నిర్బంధం చేశారు. సీఎం కేసీఆర్ ఎవరి పర్మిషన్ తీసుకుని సచివాలయానికి వెళ్లారు. సచివాలయానికి సంబంధించి సీఎంతో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులందరికి ఒకే రకమైన హక్కులు ఉంటాయి. రాష్ట్ర పరిపాలన భవనానికి వెళ్లడానికి ఎంపీకి అనుమతి ఎందుకు?” అని రేవంత్ రెడ్డి నిలదీశారు.(Revanth Reddy)

”దేశంలో నియంతృత్వం పెరుగుతోందని కేసీఆర్ అంటారు. సచివాలయానికి వెళ్లకుండా నన్ను అడ్డుకుంటారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ పూర్తి స్థాయిలో నూతన సచివాలయానికి రాలేదని ఇక్కడికి తీసుకొచ్చారు. ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల వివరాలు తెలపాలని కోరాను. నేను అప్లికేషన్ ఇచ్చినట్లు రశీదు ఇవ్వమంటే మొత్తం దస్త్రాలు నూతన సచివాలయానికి వెళ్లాయని చెప్పారు. అరవింద్ కుమార్.. నూతన సచివాలయానికి వెళ్లకుండా, ఇక్కడ ఆఫీసులో లేకుండా కేటీఆర్ ఫార్మ్ హౌస్ లో ఉన్నారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Also Read..Revanth Reddy: కొత్త సెక్రటేరియట్‌కు వెళ్తున్న రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. సచివాలయం వద్ద భారీగా పోలీసులు

” హైదరాబాద్ నగరానికి మణిహారంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించడం జరిగింది. 156 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించాము. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించాము. రూ.6,696 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగింది. ఆదాయం కోసం హైదరాబాద్ టోల్ కారిడార్ ద్వారా టోల్ వసూలు చేసేవాళ్ళు. ప్రతి రెండేళ్లకు టెండర్లు పిలిచే వాళ్ళు. కానీ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.7,380 కోట్లకు కట్టబెట్టింది.

హైదరాబాద్ నగరానికి ఎవరు రావాలన్నా ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణం చేయాల్సిందే. గతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అంతే డబ్బు వసూలు చేసేవాళ్ళు. సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఆదాయం వచ్చేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లకే ముంబై కంపెనీకి అప్పగించింది. నేడు ఔటర్ రింగ్ రోడ్డుపై అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్ధలు వచ్చాయి. మూడు నెలల్లో దిగిగిపోయే ప్రభుత్వం 30 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీకి అప్పగించింది. నేడు ఔటర్ రింగ్ రోడ్డులో 10 రూపాయలకు బదులు 40 రూపాయలు వసూలు చేస్తున్నారు.(Revanth Reddy)

Also Read..AP Politics: సైలెంట్ అయ్యారు..! చంద్రబాబు, పవన్ భేటీ.. ఏపీ బీజేపీలో మారుతున్న సమీకరణాలు..

నయా తెలంగాణ ఈడీ అమీన్ గా కేసీఆర్ మారారు. వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతోంది. టెండర్లు పిలవకుండా ఈగల్ ఇన్ ఫ్రా సంస్థకు నాలుగేళ్ల నుండి ఔటర్ రింగ్ రోడ్డును కట్టబెడుతున్నారు. తెలంగాణ ప్రజల సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంది. తెలంగాణ దోపిడీ వెనుక కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ వెనుక కేసీఆర్ ఉన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం తెలంగాణలో అమలు జరగడం లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాము. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాము” అని రేవంత్ రెడ్డి అన్నారు.