Kerala: ఆ ఇద్ద‌రు యువ‌తులు క‌లిసి జీవించొచ్చు.. కేర‌ళ హైకోర్టు కీల‌క తీర్పు..

కేర‌ళ హైకోర్టు కీల‌క తీర్పును వెలువ‌రించింది. ఒక‌రినొక‌రు ప్రేమించుకున్న ఇద్ద‌రు అమ్మాయిలు క‌లిసి జీవ‌నం సాగించొచ్చ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. లెస్బియ‌న్ జంట కేసులో కోర్టు ఈ తీర్పును వెలువ‌రించింది. కేర‌ళ‌కు చెందిన ఇద్ద‌రు అమ్మాయిలు గ‌త కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విష‌యం ఇరు కుటుంబాల్లో తెలిసి వారిని దూరంగా ఉంచారు. అయితే..

Kerala: ఆ ఇద్ద‌రు యువ‌తులు క‌లిసి జీవించొచ్చు.. కేర‌ళ హైకోర్టు కీల‌క తీర్పు..

Kerala

Kerala: కేర‌ళ హైకోర్టు కీల‌క తీర్పును వెలువ‌రించింది. ఒక‌రినొక‌రు ప్రేమించుకున్న ఇద్ద‌రు అమ్మాయిలు క‌లిసి జీవ‌నం సాగించొచ్చ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. లెస్బియ‌న్ జంట కేసులో కోర్టు ఈ తీర్పును వెలువ‌రించింది. కేర‌ళ‌కు చెందిన ఇద్ద‌రు అమ్మాయిలు గ‌త కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విష‌యం ఇరు కుటుంబాల్లో తెలిసి వారిని దూరంగా ఉంచారు. అయితే ఒక‌రినొక‌రు విడిచి ఉండ‌లేక పోయారు. మేమిద్ద‌రం క‌లిసే జీవిస్తామ‌ని మ‌రోసారి కుటుంబ వేడుకున్నా ఉప‌యోగం క‌నిపించ‌లేదు. ఈ క్ర‌మంలో యువ‌తి కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. ఇద్దరూ కలిసి జీవించాలనే కోరికను వ్యక్తం చేయడంతో జస్టిస్ కే. వినోద్ చంద్రన్. సి. జయచంద్రన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ఇద్దరు యువతులకు అనుకూలంగా తీర్పు చెప్పింది.

ఆదిలా నజ్రిన్ (22), ఫాతిమా నూరా (23)లు ఇద్ద‌రు సౌదీ అరేబియాలో చదువుకునే రోజుల నుండి ప్రేమలో ఉన్నారు. వారి కుటుంబాలు వారిద్దరూ లెస్బియన్ అని, కలిసి జీవించాలనుకుంటున్నారని తెలుసుకొని తీవ్రంగా వ్యతిరేకించారు. వారిని శారీరకంగా వేధించారు. కుటుంబ సభ్యుల నుండి హత్య బెదిరింపులు వచ్చిన‌ట్లు ఇద్ద‌రు యువ‌తులు తెలిపారు. మే 19న ఈ జంట పారిపోయి ఓ ఆశ్ర‌మంలో ఆశ్రయం పొందాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత మేం క్షేమంగా ఉన్నామ‌ని కుటుంబ స‌భ్యుల‌కు తెలిపారు. ఫాతిమా కుటుంబీకులు అక్కడికి చేరుకుని ఆమెను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Indian railway: దిగొచ్చిన రైల్వేశాఖ.. రూ.35కోసం ఓ వ్యక్తి ఐదేళ్లుగా పోరాటం.. 3లక్షల మందికి లబ్ధి..

అదే రోజు ఆదిల తల్లి, సోదరి వారి వ‌ద్ద‌కువెళ్లి వారి సంబంధాన్ని అంగీకరిస్తామని హామీ ఇచ్చారు. ఫాతిమా కుటుంబం అందుకు అనుమ‌తించ‌లేదు. ఆ తర్వాత, వారిని అలువాలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఫాతిమా కుటుంబ సభ్యులు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను మలప్పురానికి తీసుకెళ్లారు. ఫాతిమా కుటుంబసభ్యులు ఆమెను సౌదీ అరేబియాకు పంపించి, ఆమెకు ఇష్టం లేకుండా వివాహం జరిపించాలని చూశారు.

Singer KK: ప్రఖ్యాత సింగర్ ‘కేకే’ కన్నుమూత

వీరిలో ఓ యువ‌తి మేం క‌లిసి జీవించేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ కోర్టును ఆశ్ర‌యించింది. ఇద్ద‌రు యువ‌తుల అభిప్రాయాన్ని సేక‌రించిన కోర్టు.. వారిద్ద‌రి క‌లిసే జీవ‌నం సాగించొచ్చ‌ని తీర్పును ఇచ్చింది. తీర్పు అనంత‌రం ఫాతిమా మాట్లాడుతూ.. చివ‌రిగా నును ఆదిలాతో ఉన్నాను. నేను సంతోషంగా ఉన్నాను. కానీ నేను శారీర‌కంగా, మాన‌సికంగా కూడా అలిసిపోయాను. నాకు కొంత విశ్రాంతి కావాలి. స్థిర‌ప‌డాల‌ని ఫాతిమా పేర్కొంది. ఇదిలాఉంటే ఒక లెస్బియన్ జంట కలిసి జీవించడానికి కోర్టు అనుమతించడం ఇది మొదటి ఉదాహరణ కాదు. సెప్టెంబరు 2018లో కేరళ హైకోర్టు దక్షిణ కేరళలో ఉన్న ఒక లెస్బియన్ జంటకు స్వేచ్ఛను కల్పించింది. వారు కలిసి జీవించడానికి అనుమతించింది.